‘కర్మ సిద్ధాంతం ఎవరినీ వదిలిపెట్టదు’: నటి రేణు దేశాయ్ ఘాటు వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |   (  Updated:2026-05-01 12:37:29  IST  )

ఇటీవల వెలుగులోకి వచ్చిన కుక్కల రక్తం విక్రయాల ఉదంతంపై నటి రేణు దేశాయ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

‘కర్మ సిద్ధాంతం ఎవరినీ వదిలిపెట్టదు’: నటి రేణు దేశాయ్ ఘాటు వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల వెలుగులోకి వచ్చిన కుక్కల రక్తం విక్రయాల ఉదంతంపై నటి రేణు దేశాయ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మూగజీవాల పట్ల జరుగుతున్న ఈ దారుణాలను చూస్తుంటే మనం ఎంతటి భయంకరమైన 'కలికాలం'లో ఉన్నామో అర్థమవుతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రేణు దేశాయ్ మాట్లాడుతూ.. "ప్రస్తుత రోజుల్లో మనుషులనే కిడ్నాప్ చేసి, వారి కిడ్నీలను తీసి అమ్మేస్తున్న కఠిన హృదయులు ఉన్న సమాజం ఇది. అటువంటప్పుడు నోరులేని కుక్కలను వారు వదులుతారని ఎలా అనుకుంటాం?" అని ప్రశ్నించారు. స్వార్థం కోసం మనుషులు ఎంతకైనా తెగిస్తున్నారని ఆమె మండిపడ్డారు. కుక్కల రక్తం అమ్మేవారిని మాత్రమే కాకుండా, కొనేవారిని కూడా ఆమె తప్పుబట్టారు. "రక్తం అమ్మేవాడిది ఎంత తప్పో, కొనేవాడిది కూడా అంతే తప్పు. అసలు ఆ రక్తం ఎక్కడి నుంచి వస్తోంది? ఏ పరిస్థితుల్లో సేకరిస్తున్నారు? అనే కనీస ఆరా తీయాల్సిన బాధ్యత కొనుగోలుదారులపై ఉంది" అని స్పష్టం చేశారు. మూలాలను వెతక్కుండా కొనుగోలు చేయడం వల్ల ఇటువంటి అక్రమ దందాలకు ఊతం ఇచ్చినట్లవుతుందని హెచ్చరించారు.

కర్మ సిద్ధాంతాన్ని మరువకండి..

చివరగా, తప్పు చేసిన వారు ఎవరైనా సరే శిక్ష నుంచి తప్పించుకోలేరని రేణు దేశాయ్ పేర్కొన్నారు. "ప్రతి ఒక్కరూ కర్మ సిద్ధాంతాన్ని గుర్తుంచుకోవాలి. మనం చేసే ప్రతి తప్పుకు ఫలితం అనుభవించాల్సిందే. మనం చేసే కర్మ మనకు తిరిగి వస్తుందనే నిజాన్ని అందరూ నమ్మాలి" అంటూ ఆమె హితవు పలికారు.

15 లక్షల కారణంగా చిరంజీవికి దూరమైన ఆ బ్లాక్‌బస్టర్

Next Story