15 లక్షల కారణంగా చిరంజీవికి దూరమైన ఆ బ్లాక్‌బస్టర్

by Pulgam srinivas |   (  Updated:2026-05-01 12:38:35  IST  )

కేవలం 15 లక్షల వల్ల చిరంజీవి చేతి నుంచి భాషా సినిమా జారిపోయినట్లు తెలుస్తోంది.

15 లక్షల కారణంగా చిరంజీవికి దూరమైన ఆ బ్లాక్‌బస్టర్
X

దిశ, వెబ్ డెస్క్: మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాలను మిస్ చేసుకున్నాడు. అలా మిస్ అయిన వాటిలో ఒకటి భాషా. ఈ చిత్రం ఎలా ఆయన చేతి నుంచి జారిపోయిందో చూద్దాం. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా, నగ్మా హీరోయిన్‌గా రూపొందిన ఈ చిత్రానికి సురేష్ కృష్ణ దర్శకత్వం వహించారు. ఒక సమయంలో సురేష్ కృష్ణ నేరుగా చిరంజీవి మరియు అల్లు అరవింద్‌ను కలిసి “భాషా” కథను వివరించాడు. ఆ కథ ఇద్దరికీ చాలా నచ్చింది. ఆ సమయంలో తమిళ్‌లో సినిమా ఇంకా విడుదల కాలేదు. కానీ రీమేక్ హక్కుల కోసం నిర్మాతలు 40 లక్షలు డిమాండ్ చేశారు. అయితే అల్లు అరవింద్ మాత్రం 25 లక్షల వరకే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు.

ఈ ధర విషయంలో ఒప్పందం కుదరలేదు. దాంతో “భాషా” తమిళ్‌లో విడుదలై సంచలన విజయాన్ని సాధించింది. తర్వాత నిర్మాతలు రీమేక్ హక్కులు అమ్మడం కంటే, సినిమాను నేరుగా తెలుగులో డబ్బింగ్ చేసి విడుదల చేయడం మంచిదని నిర్ణయించారు. అదే విధంగా తెలుగులో విడుదల చేసినా ఈ సినిమా ఇక్కడ కూడా భారీ విజయాన్ని అందుకుంది. ఇలా కేవలం 15 లక్షల తేడా వల్ల చిరంజీవి ఒక పెద్ద బ్లాక్‌బస్టర్‌ను కోల్పోయినట్లు చెబుతారు. 1995 జనవరి 12న తమిళ్‌లో విడుదలైన ఈ సినిమా, అదే ఏడాది ఏప్రిల్‌లో తెలుగులోకి వచ్చి ఇక్కడ కూడా రికార్డులు సృష్టించింది. ఈ చిత్రంతో రజనీకాంత్ ఇమేజ్ మరింత ఎత్తుకు వెళ్లింది.

మెగా ఫ్యాన్స్‌కు సూపర్ గుడ్ న్యూస్.. పెద్ది రిలీజ్ డేట్ ప్రకటిస్తూ అదిరిపోయే పోస్టర్ రిలీజ్ చేసిన మేకర్స్

‘కర్మ సిద్ధాంతం ఎవరినీ వదిలిపెట్టదు’: నటి రేణు దేశాయ్ ఘాటు వ్యాఖ్యలు

Next Story