మెగా ఫ్యాన్స్‌కు సూపర్ గుడ్ న్యూస్.. పెద్ది రిలీజ్ డేట్ ప్రకటిస్తూ అదిరిపోయే పోస్టర్ రిలీజ్ చేసిన మేకర్స్

by Chukka Sudharani |   (  Updated:2026-05-01 12:24:56  IST  )

రామ్ చరణ్ ‘పెద్ది’ రిలీజ్ డేట్ ప్రకటిస్తూ సూపర్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్.

మెగా ఫ్యాన్స్‌కు సూపర్ గుడ్ న్యూస్.. పెద్ది రిలీజ్ డేట్ ప్రకటిస్తూ అదిరిపోయే పోస్టర్ రిలీజ్ చేసిన మేకర్స్
X

దిశ, సినిమా: మెగా ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్న ‘పెద్ది’ రిలీజ్‌పై ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చారు టీమ్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న రూరల్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ షూటింగ్ మొత్తం పూర్తయింది. చిత్ర బృందం ఇప్పుడు ఒక ముఖ్యమైన అప్‌డేట్‌తో అభిమానులను సర్ప్రైజ్ చేసింది. ఈ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానున్నట్లు అధికారిక ప్రకటన ఇచ్చారు. జూన్ ప్రారంభంలో రిలీజ్ కావడం వల్ల సమ్మర్ హాలిడేస్ చివరి దశలో థియేటర్స్‌లో ప్రేక్షక ఆదరణ అందుకోవడానికి ఇది పర్ఫెక్ట్ టైం అని భావించారు టీమ్.

ఇక హైదరాబాద్‌లోని ఒక భారీ సెట్‌లో అద్భుతమైన స్పెషల్ సాంగ్ చిత్రీకరణను చిత్ర బృందం పూర్తి చేయడంతో అధికారికంగా ప్రొడక్షన్ వర్క్స్ కూడా పూర్తయ్యాయి. ఈ ఎనర్జిటిక్ సాంగ్ 'పెద్ది' చిత్రంలోని మెయిన్ హైలెట్స్‌లో ఒకటిగా నిలవనుంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా సైమల్టేనియస్‌‌గా వేగంగా సాగుతుండటంతో డేట్ ప్రకటించారు మేకర్స్. ప్రజెంట్ ఈ అనౌన్స్‌మెంట్‌తో ఫ్యాన్స్ ఆనందానికి అవదులు లేకుండా పోతున్నాయి. కాగా.. జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.

Next Story