రైతన్నలకు గుడ్ న్యూస్: రెండో విడత రైతు భరోసాకు ముహూర్తం ఖరారు!

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-04-03 02:55:00  IST  )

రెండో విడత రైతు భరోసా కోసం తెలంగాణ ప్రభుత్వం సన్నాాలు చేస్తోంది. త్వరలోనే నిధులను విడుదల చేయనున్నట్లు సమాచారం.

రైతన్నలకు గుడ్ న్యూస్: రెండో విడత రైతు భరోసాకు ముహూర్తం ఖరారు!
X

దిశ, తెలంగాణ బ్యూరో : రెండో విడత రైతుభరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమచేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. అందుకోసం రూ.2,650 కోట్ల నిధులను సమీకరించాలని ఆర్థిక శాఖను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్టు సమాచారం. దీంతో జీతాలు, అప్పులకు కిస్తీలు చెల్లించిన తర్వాత రైతుభరోసాకు కావాల్సిన నిధులను సేకరించే పనిలో అధికారులు నిమగ్నమైనట్టు తెలిసింది. మొత్తం మూడు విడతల్లో యాసంగి రైతు భరోసా నిధులను జమచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి విడతలో భాగంగా మార్చి 22న ఎకరం వరకు రూ.3,590 కోట్లను 70 లక్షల మంది రైతుల అకౌంట్లలో జమ చేసింది. రెండో విడత నిధులను ఈనెల 2వ వారంలో జమచేసేందుకు కసరత్తు చేస్తున్నది. ఈసారి ఎకరం కన్నా ఎక్కువ భూమి ఉన్న రైతులకు నిధులు జమ అవుతాయి. దాదాపు 5 ఎకరాల విస్తీర్ణం వరకు రెండో దఫాలో నిధులు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్లాన్ చేసినట్టు తెలిసింది. ఆపైన భూమి ఉన్న రైతులకు కావాల్సిన నిధులను ఈనెల చివరన చెల్లించాలని భావిస్తున్నది. ప్రతి సీజన్‌లో ఎకరాకు రూ.6వేల చొప్పున పంటసాగు కోసం రైతులకు ప్రభుత్వం ఆర్థికసాయం చేస్తున్నది. అందుకోసం రూ.9 వేల కోట్లు అవసరం అవుతున్నాయి. ఆర్థిక వనరుల కొరత కారణంగా మూడు దఫాలుగా ఇవ్వాలని ప్రభుత్వం ప్లాన్ చేసింది.

'ఇందిరా మహిళా శక్తి' భవనాలు: గ్రామీణ ప్రగతిలో సరికొత్త మైలురాయి

Next Story