యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు.. దర్శనానికి 3 గంటలు

by Ajay Maddhiboyina |

తెలంగాణలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టకు భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవుదినం కావడంతో భక్తులు భారీగా తరలివస్తున్నారు. దీంతో ఉచిత దర్శనానికి సుమారు 3గంటల సమయం పడుతోంది.

యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు.. దర్శనానికి 3 గంటలు
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టకు భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవుదినం కావడంతో భక్తులు భారీగా తరలివస్తున్నారు. దీంతో ఉచిత దర్శనానికి సుమారు 3గంటల సమయం పడుతోంది. అంతేకాకుండా ప్రత్యేక దర్శనానికి 2గంటల సమయం పడుతోంది. ఆర్జిత సేవలు, నిత్య పూజల్లో భక్తులు పాల్గొంటున్నారు. నిత్య కల్యాణం, లడ్డు ప్రసాదం కౌంటర్లు, సత్యనారాయణ స్వామి వ్రత మండపంలో భారీ రద్దీ నెలకొంది. మరోవైపు కొండపైకి వెళుతున్న వాహనాలతో ఘాట్ రోడ్డుపై ట్రాఫిక్ రద్దీ ఏర్పడింది. ఇదిలా ఉంటే యాదాద్రికి అభివృద్ధి జ‌రిగిన త‌ర‌వాత మెల్లిమెల్లిగా భ‌క్తుల ర‌ద్దీ పెరుగుతోంది. హైద‌రాబాద్ కు ద‌గ్గ‌ర‌గా ఉండటంతో న‌గ‌ర‌వాసుల‌తో పాటు చుట్టుప‌క్క‌ల ప్రాంతాల‌వారు సైతం యాదాద్రి ద‌ర్శ‌నానికి వ‌స్తున్నారు. ముఖ్యంగా వీకెండ్స్ లో స్వామివారి ద‌ర్శ‌నానికి వ‌చ్చే భ‌క్తుల సంఖ్య మ‌రింత పెరుగుతోంది.

Next Story