బిర్యానీలో ప్లాస్టిక్ కవర్ కలకలం..

by Kodari Anjali |

ఓ వ్యక్తి బిర్యానీ తింటుండగా.. బిర్యానీలో ప్లాస్టిక్ కవర్ వచ్చిన ఘటన జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని (ఆర్ బీ) రెస్టారెంట్లో జరిగింది.

బిర్యానీలో ప్లాస్టిక్ కవర్ కలకలం..
X

దిశ, మెట్ పల్లి: జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని (ఆర్ బీ) రెస్టారెంట్లో ఓ వ్యక్తి తన కుటుంబంతో బిర్యానీలో తినేందుకు వెళ్లగా బిర్యానీ ప్లాస్టిక్ కవర్ రావడం కలకలం రేపింది. వివరాల్లోకెళ్తే.. మెట్ పల్లి పట్టణానికి చెందిన కరుణాకర్ అనే యువకుడు ఫ్యామిలీతో సహా బిర్యానీ తింటుండగా అతని కుమారుడు తినే బిర్యానీలో ప్లాస్టిక్ కవర్ కనపడటంతో ఒక్కసారిగా ఖంగుతిన్నారు. ఇదేంటని హోటల్ యాజమాన్యాన్ని బాధితుడు నిలదీయగా.. ఇది కామనే అని నిర్లక్ష్యపు సమాధానం చెబుతున్నారు అని వాపోయారు. ఇలాంటి నిర్లక్ష్యం హోటల్స్ పై సంబంధిత అధికారులు తనిఖీలు చేసి చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.

Next Story