- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కారు పైకప్పుపై కూర్చొని ప్రయాణం.. ఇద్దరిపై కేసు
ఆర్‌జీఐఏ ఎయిర్‌పోర్టు రోడ్డుపై అక్రమంగా మార్పులు చేసిన కారులో ప్రమాదకరంగా ప్రయాణించిన ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

దిశ, శంషాబాద్: ఆర్‌జీఐఏ ఎయిర్‌పోర్టు రోడ్డుపై అక్రమంగా మార్పులు చేసిన కారులో ప్రమాదకరంగా ప్రయాణించిన ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. జూలై 14న సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో వైరల్ అయిన వీడియో ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టగా, టీజీ 08 ఏజీ 92XX నంబర్ గల కారును జి. సాయి తరుణ్ నడుపుతుండగా, ప్రకాశం జిల్లాకు చెందిన ఐటీ ఉద్యోగిని వి. లక్ష్మీ ప్రియాంక (30) కారు పైకప్పుపై కూర్చొని ప్రయాణించినట్లు గుర్తించారు. విచారణలో వాహనం పైకప్పును అక్రమంగా తొలగించి మార్పులు చేసినట్లు తేలింది. ఇటువంటి అనధికార మార్పులు, నిర్లక్ష్యంగా వాహనం నడపడం ప్రయాణికులతో పాటు ఇతర రహదారి వినియోగదారుల ప్రాణాలకు ముప్పు కలిగిస్తాయని పోలీసులు తెలిపారు. ఆర్‌జీఐఏ ట్రాఫిక్ పోలీసుల ఫిర్యాదు మేరకు ఆర్‌జీఐ ఎయిర్‌పోర్టు పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నం. 653/2026గా భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 125, 3(5) కింద వి. లక్ష్మీ ప్రియాంక, జి. సాయి తరుణ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వాహనాలకు అనధికార మార్పులు చేయడం, ప్రమాదకరంగా ప్రయాణించడం, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడం వంటి చర్యలపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.






