కేరళలో UDF మేనిఫెస్టో రిలీజ్.. కేరళం సీఎంకు రేవంత్ రెడ్డి చాలెంజ్

by Prasad Jukanti |   (  Updated:2026-04-02 12:07:55  IST  )

కేరళలో యూడీఎఫ్ మేనిఫెస్టోను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. ఉచిత బస్సు ప్రయాణం, రూ.3000 పెన్షన్ వంటి కీలక హామీలతో కూడిన ఇందిర గ్యారెంటీలు ఇవే!

కేరళలో UDF మేనిఫెస్టో రిలీజ్.. కేరళం సీఎంకు రేవంత్ రెడ్డి చాలెంజ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో కేసీఆర్ ఫ్యామిలీకి, కేరళలో విజయన్‍కు పెద్ద తేడా లేదని, పదేళ్లలో అటు తెలంగాణను కేసీఆర్, ఇటు కేరళను విజయన్ భ్రష్టు పట్టించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పిచారు. 2023 డిసెంబర్‍లో తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించామని, ఈ నెలలో కేరళలో కూడా పదేళ్ల పాటు ఉండేలా యూడీఎఫ్ ప్రభుత్వం రాబోతోందని జోస్యం చెప్పారు. కేరళం పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి అక్కడ తన రెండోరోజు పర్యటనలో భాగంగా ఇవాళ కొచ్చిన్‍లో యూడీఎఫ్ (UDF) కూటమి మేనిఫెస్టోను స్థానిక నేతలతో కలిసి విడుదల చేశారు. మొత్తం ఐదు గ్యారెంటీలతో ఈ మేనిఫెస్టోను రూపొందిచారు. ఈ సందర్భంగా కేరళం సీఎంపై ఆయన ఘాటు విమర్శలు చేశారు.

విజయన్‍కు సవాల్:

ఈ సందర్భంగా కేరళం సీఎం పినరయి విజయన్‍కు రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. తెలంగాణ ప్రజాపాలన నడుస్తోంది మా రాష్ట్రానిక వచ్చి ఆరు గ్యారెంటీలు ఎలా అమలవుతున్నాయో వచ్చి చూడాలని చాలెంజ్ చేశారు. తెలంగాణలో మేము పాలకులుగా కాకుండా సేవకులంగా పని చేస్తున్నామని ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు మాకు మద్దతు తెలిపారన్నారు. తెలంగాణలో 67,173 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం. రైతుల రుణాల మాఫీ చేశామన్నారు. రైతు భరోసాకు రూ. 18 కోట్లు ఇచ్చినట్లు వెల్లడించారు. నాకు మంత్రిగా అనుభవం లేకపోయినా ప్రజల జీవితాలను చూసిన అనుభవం ఉందన్నారు. కేళం మరో తెలంగాణ కాబోతోందన్నారు.

ఉచిత బస్సు ప్రయాణం, రూ.3000 పెన్షన్:

‘కేరళ గెలుస్తుంది - యూడీఎఫ్ నడిపిస్తుంది’ అనే నినాదంతో ‘ఇందిర గ్యారెంటీ’ పేరుతో పలు ఆకర్షణీయమైన పథకాలను తమ ఎన్నికల హామీలుగా యూడీఎఫ్ ప్రకటించింది.మహిళా సంక్షేమం కింద కేఎస్ఆర్‌టీసీ (KSRTC) బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం. కళాశాల విద్యార్థినులకు నెలకు రూ.1,000 ఆర్థిక సాయం ఇస్తామని హామీ ఇచ్చారు. సామాజిక పెన్షన్ పథకం కింద సంక్షేమ పెన్షన్లను రూ.3,000 కు పెంపు, మాజీ ముఖ్యమంత్రి ఉమ్మన్ చాందీ పేరుతో ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల వరకు ఉచిత ఆరోగ్య భీమా కల్పించనున్నట్లు తెలిపారు. వ్యాపారాలు ప్రారంభించే యువతకు రూ.5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు. నిరుద్యోగుల కోసం ‘జాబ్ వాచ్ టవర్’, యువశ్రీ పథకం అమలు చేస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు బెడ్ పొందడం ప్రాథమిక హక్కుగా (ఎవరూ నేలపై పడుకోవాల్సిన అవసరం ఉండదు) మారుస్తామని ప్రకటించారు.

బీపీఎల్ (BPL) కుటుంబాలకు ఉచిత డయాలసిస్, మొబైల్ కీమోథెరపీ యూనిట్ల ఏర్పాటు, మహిళలకు ఉచిత మ్యామోగ్రామ్ పరీక్షలు, జిప్మర్ (JIPMER) తరహాలో 'నో బిల్' (ఖర్చు లేని) ఆసుపత్రుల స్థాపిస్తామని హామీ ఇచ్చారు. విదేశాల్లో చదువుకునే పేద విద్యార్థుల కోసం ‘కె.ఆర్. నారాయణన్ స్కాలర్‌షిప్’. వాయనాడ్‌లో ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు, ఆశా వర్కర్ల వేతనం రోజుకు ₹700 కు పెంపు. వృద్ధుల సంక్షేమం కోసం ప్రత్యేక శాఖ కేటాయించనున్నట్లు పేర్కొన్నారు. అలాగే మేనిఫెస్టోలోని హామీల అమలును పర్యవేక్షించడానికి ఒక ప్రత్యేక ఎంపవరింగ్ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు యూడీఎఫ్ ప్రకటించింది. కేరళను ప్రపంచ స్థాయి హెల్త్ డెస్టినేషన్‌గా మార్చడమే తమ లక్ష్యమని కూటమి వెల్లడించింది.

రాష్ట్రమంతటా మొదలైన గ్రామ సభలు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక సందేశం

Next Story