- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
'రాను బొంబాయికి రాను'.. మల్లారెడ్డి కోడలు మాస్ డ్యాన్స్ వైరల్!
మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఇంట్లో సంబరాలు అంబరాన్నంటాయి. మల్లారెడ్డి - కల్పనమ్మల 50వ వివాహ వార్షికోత్సవ వేడుకలు బోయిన్‌పల్లిలోని ఆయన నివాసంలో అత్యంత వైభవంగా జరిగాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఇంట్లో సంబరాలు అంబరాన్నంటాయి. మల్లారెడ్డి - కల్పనమ్మల 50వ వివాహ వార్షికోత్సవ (Golden Jubilee) వేడుకలు బోయిన్‌పల్లిలోని ఆయన నివాసంలో అత్యంత వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో మల్లారెడ్డి కోడలు డాక్టర్ ప్రీతి రెడ్డి తన డ్యాన్స్‌తో మరోసారి అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రముఖ తెలంగాణ జానపదం 'రాను బొంబాయికి రాను' పాటకు ప్రీతి రెడ్డి అద్భుతమైన డ్యాన్స్ చేశారు. చీరకట్టులో ఉత్సాహంగా, ఒక కాలేజీ అమ్మాయిలా ఆమె వేసిన మాస్ స్టెప్పులు అతిథులను కట్టిపడేశాయి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆమె డ్యాన్స్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
తగ్గేదేలే అన్న మల్లారెడ్డి!
కోడలితో పాటు మామ మల్లారెడ్డి కూడా డ్యాన్స్‌లో ఏమాత్రం తగ్గలేదు. 70 ఏళ్ల వయసులోనూ అదే ఉత్సాహంతో బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ నటించిన 'దురంధర్' పాటకు ఆయన స్టెప్పులేశారు. కుర్రాళ్లకు పోటీ ఇచ్చేలా ఆయన చేసిన డ్యాన్స్ చూసి వేడుకకు హాజరైన రాజకీయ ప్రముఖులు, కుటుంబ సభ్యులు కేరింతలు కొట్టారు.






