- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కిక్కేలేని వైన్స్ టెండర్లు.. ఆసక్తి చూపని వ్యాపారులు.. కారణం ఇదేనా!?
గత ఎక్సైజ్ పాలసీ ముగియడానికి 2 నెలల ముందుగానే ఎక్సైజ్ శాఖ వైన్స్ దుకాణాలకు టెండర్లను పిలవగా..

దిశ, రంగారెడ్డి బ్యూరో: గత ఎక్సైజ్ పాలసీ ముగియడానికి 2 నెలల ముందుగానే ఎక్సైజ్ శాఖ వైన్స్ దుకాణాలకు టెండర్లను పిలవగా.. వ్యాపారుల నుంచి ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రాలేదు. ఆఖరి రోజున శనివారం పెద్ద ఎత్తున వ స్తాయని ఆశించిన ఎక్సైజ్ శాఖకు భంగపాటే కలిగింది. వైన్స్ టెండర్ దరఖాస్తుకు ఆదివారం సాయం త్రం 5 గంటల వరకు గడువు ముగియగా.. చివరి రోజున దరఖాస్తు కౌంటర్ల వద్ద సందడి సందడి నెలకొంది.
క్యూలైన్ లో ఉన్నవారి నుం చి శనివారం రాత్రి వరకు కూడా అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. శనివారం రాత్రి 8 గంటల వరకు అందిన సమాచారం మేరకు శంషాబాద్ సూపరింటెండెంట్ ప రిధిలో 6,700 దరఖాస్తులు, సరూ ర్ నగర్ పరిధిలో 6,641 దరఖాస్తు లు వచ్చాయి. ఏది ఏమైనా.. గతంతో పోలిస్తే ఈసారి రంగారెడ్డి జిల్లా లో దరఖాస్తులు 14 వేలకు మించి ఉండకపోవచ్చునని తెలుస్తోంది. వికారాబాద్ జిల్లాలో గతంలో 2,637 దరఖాస్తులు రాగా.. ఈసారి 1,602 దరఖాస్తులు మాత్రమే రావడం గమనార్హం. దరఖాస్తులు తగ్గడానికి వ్యాపార వర్గాలు అనేక కారణాలు చెబుతున్నారు.
దరఖాస్తులు అంతంతే..
ఈ సారి వైన్స్ దుకాణాలకు దరఖాస్తులు గతంతో పోలిస్తే సగానికి కంటే కాస్తో కూస్తో ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో సరూర్ నగర్ ఎక్సైజ్ సూ పరింటెండెంట్ పరిధిలో ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, ఆమనల్లు, షాద్ నగర్, సరూర్ నగర్, హయ త్ నగర్ ఎక్సైజ్ డివిజన్ల పరిధిలోని 134 వైన్స్ దుకాణాలకు మొత్తం 10,994 దరఖాస్తులు వచ్చాయి. అలాగే శంషాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పరిధిలో చేవెళ్ల, శం షాబాద్, శేరిలింగంపల్లి ఎక్సైజ్ డి విజన్ల పరిధిలో వంద దుకాణాలకు గాను మొత్తం 10,621 దరఖాస్తులు వచ్చాయి. గతంలో టెండరు రూపేణా చెల్లించిన రూ.2లక్షల రుసుముతో రంగారెడ్డి జిల్లాలోనే ప్రభుత్వ ఖజానాకు రూ.432.30 కోట్ల ఆదాయం సమకూరింది.
కానీ ఈసారి పరిస్థితి గతం కంటే భిన్నంగా ఉంది. రంగారెడ్డి జిల్లా లోని 224 దుకాణాలకు, వికారాబాద్ జిల్లాలోని 59 దుకాణాలకు టెండర్లు పిలిచారు. గత సెప్టెంబరు 26 నుంచి దరఖాస్తుల ప్రక్రియ మొదలవగా.. అక్టోబర్ 18 వరకు స్వీకరించారు. మొదటి నుంచి ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రా లేదు. అయితే ప్రతిసారి గడువు చి వరి రోజుల్లో దరఖాస్తులు పెద్ద ఎత్తున దాఖలైన సందర్భాలు ఉండడంతో.. ఈసారి కూడా అలాగే వ స్తాయని ఎక్సైజ్ శాఖ అధికారులు సైతం ఆశించారు. కానీ.. అందరి అంచనాలు తలకిందులయ్యాయి. శనివారం రాత్రి 8 గంటల వరకు రంగారెడ్డి జిల్లాలో 249 దుకాణాలకు కలిపి 13,341 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. ఇక వికారాబా ద్ జిల్లాలోని 59 వైన్స్ దుకాణాల కు 17 వరకు 1,044 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. ఆఖరి రోజున 558 దరఖాస్తులు రాగా.. మొత్తం గా వికారాబాద్ జిల్లాలోని అన్ని షాపులకు కలిపి 1,602 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. గతంతో పోలిస్తే.. ఈ సారి అర్జీల సంఖ్య 1,035 దరఖాస్తులు తగ్గాయి.
ఆసక్తి చూపని వ్యాపారులు..
వైన్స్ టెండర్ల కోసం గతంలో మ ద్యం వ్యాపారులతోపాటు వివిధ వర్గాల వారు సైతం పోటీ పడిన సందర్భాలున్నాయి. గౌడ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు సైతం ప్రభుత్వం కొన్ని వైన్స్ షాపులను కేటాయించింది. టెండర్ల కోసం ప్రతిసారీ తీవ్ర పోటీ ఉంటుండగా.. ఈసారి టెండర్ల దాఖలుకు వ్యాపారులు అంతగా ఆసక్తి చూపించలేకపోయారు. ఇందుకు ఆయా వర్గాలు అనేక కారణాలు చెబుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ప్రక్రియకు ఆటంకం కలగకుండా ఎన్నికలు స జావుగా సాగినట్లయితే వైన్స్ టెండ ర్లు పెద్ద ఎత్తున దాఖలయ్యే అవకా శం ఉండేదని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి.
ఎన్నికల పై స్తబ్దత నెలకొనడం.. అసలు జరుగుతా యో! లేదో? అన్న సందిగ్ధత ఏర్పడడంతో అర్జీలను చాలా మంది వెనుకడుగు వేయాల్సి వచ్చింది. ఒక వేళ మద్యం అమ్మకాలు ఆశించిన లేకపోతే ఎలా?. పెట్టిన పెట్టుబడులు కూడా రాకపోతే పరిస్థితి ఏంటి? వంటి అనేక సందేహాలు అందరినీ వెంటాడాయి. అధికారులకు మామూళ్లు ఇవ్వడం మొదలుకొని ఇతరత్రా ఖర్చులతో మిగులుబాటు కూడా పెద్దగా ఉండకపోవచ్చునన్న భావనలో చాలామంది ఉండిపోయారు. రియల్ ఎస్టేట్ కూడా ఊపు మీద లేకపోవడం కూడా వైన్స్ టెండర్లు తగ్గడానికి మరో కా రణంగా పలువురు ఉదహరిస్తున్నారు.
అలాగే..టెండర్ ఫీజును సైతం ప్రభుత్వం ఈ సారి రూ.3లక్షలకు పెంచింది. గతంలో రూ.2లక్షలు ఉంటే ఒక్కొక్కరు రెండు, మూడు దుకాణాలకు టెండర్లు వేశారు. ఈసారి ఏకంగా రూ.లక్ష పెరగడం తో రెండు దుకాణాలకు టెండర్ వే యాలన్నా రూ.6లక్షలు అవుతోం ది. ఎలాగూ.. ఈ డబ్బు తిరిగి రాదు. కాబట్టి అంత మొత్తాన్ని కోల్పోవాల్సి రావడం వల్ల కూడా చాలా మంది టెండర్లకు దూరంగా ఉన్నారు. ప్రతిసారి సిండికేట్‌గా ఐదు గురు మొదలుకొని 500 మంది వరకు కూడా గ్రూపుగా టెండర్లు దాఖలు చేసిన సందర్భాలు ఉన్నాయి. దీనివల్ల దరఖాస్తులు సైతం పెద్ద మొత్తంలో దాఖలయ్యేవి. కానీ.. ఈసారి టెండర్ల పట్ల నిరాసక్తతతో ఉండడంతో సిండికేట్ గ్రూపుల్లోని సంఖ్య 100-200కు మించలేదు. ఈ కారణంగా దరఖాస్తులు తగ్గాయి. ఎక్సైజ్ అధికారులు 23న లా టరీ పద్ధతిన డ్రా తీసి వైన్స్ దుకాణాలను కేటాయించనున్నారు.
Read More..
ఆశావాహులకు శుభవార్త.. వైన్స్ టెండర్ల దరఖాస్తు తేదీ పొడిగింపు






