ఆశావాహులకు శుభవార్త.. వైన్స్ టెండర్ల దరఖాస్తు తేదీ పొడిగింపు

by Malleboina Mahesh |   (  Updated:2025-10-19 03:35:12  IST  )

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటితో వైన్స్ టెండర్ల దరఖాస్తుకు గడువు ముగిసింది. అయితే నిన్న బీసీ బంద్ కారణంగా బ్యాంకులు బంద్ ఉండటంతో.. అశావాహులు నిర్ణీత సమయంలో దరఖాస్తులు సమర్పించలేకపోయారు.

ఆశావాహులకు శుభవార్త.. వైన్స్ టెండర్ల దరఖాస్తు తేదీ పొడిగింపు
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటితో వైన్స్ టెండర్ల దరఖాస్తుకు (Wines Tender Application) గడువు ముగిసింది. అయితే నిన్న బీసీ బంద్ కారణంగా బ్యాంకులు బంద్ ఉండటంతో.. అశావాహులు నిర్ణీత సమయంలో దరఖాస్తులు సమర్పించలేకపోయారు. దీంతో వైన్స్ టెండర్లు వేయాలని ఆసక్తి ఉన్నవారు. తమ విజ్ఞప్తి ని పరిగణలోకి టెండర్లకు మరోసారి అవకాశం కల్పించాలని అన్ని జిల్లాలోని కలెక్టర్లను, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారులను కోరారు. దీంతో వారు రాష్ట్ర ఎక్సైజ్ శాఖకు నివేదిక అందించారు. దీంతో ఆశావాహుల విజ్ఞప్తి మేరకు వైన్స్ టెండర్ల దరఖాస్తుకు మరో అవకాశం కల్పించారు.

మద్యం షాపుల లైసెన్సుల కోసం దరఖాస్తులను ఈ నెల 23వ తేదీ వరకు స్వీకరించనున్నట్లు ఎక్సైజ్ శాఖ కమిషనర్ (Commissioner of Excise Department) ప్రకటన విడుదల చేశారు. ఈ మేరకు అన్ని జిల్లాల అధికారులకు ఈ ఆదేశాలను ఇచ్చారు. దీంతో గత నోటిఫికేషన్ ప్రకారం ఈనెల 23న కలెక్టర్ల సమక్షంలో జరగాల్సిన డ్రా కార్యక్రమాన్ని వాయిదా వేశారు. అలాగే 23 వరకు వచ్చే ధరఖాస్తులతో కలిపి ఈ నెల 27వ తేదీన డ్రాలు (Draws on the 27th) నిర్వహించనున్నట్లు కమిషనర్ తెలిపారు. ఈ నిర్ణయంతో ఇప్పటి వరకు వచ్చిన ధరఖాస్తులతో పాటు మరింత మంది అశావాహులు ధరఖాస్తులు చేసుకునే అవకాశం కనిపిస్తుంది. అలాగే ప్రభుత్వానికి సైతం పెద్ద మొత్తంలో ఆదాయం కూడా పెరగనుంది.

Read More..

కిక్కేలేని వైన్స్​‍ టెండర్లు.. ఆసక్తి చూపని వ్యాపారులు.. కారణం ఇదేనా!?

Next Story