గ్రామాల రూపురేఖలు మారాయి: ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్

by Disha Web Desk 11 |
గ్రామాల రూపురేఖలు మారాయి: ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్
X

దిశ, శంషాబాద్: బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామాల అభివృద్దికి పెద్దపీట వేయడంతో గ్రామాల రూపురేఖలు మారాయని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు. శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండ గ్రామంలో రూ. 25 లక్షల నిధులతో నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని గురువారం శంషాబాద్ ఎంపీపీ జయమ్మ శ్రీనివాస్, జడ్పీటీసీ నీరటీ తన్వీరాజ్ తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న తెలంగాణలో అభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు.

గ్రామాలలో సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, నూతన గ్రామపంచాయతీ భవనాల నిర్మాణం, తాగునీరు అందించడం, స్మశానవాటికలు లాంటివి నిర్మించి ప్రజలకు మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ చంద్రకళ, తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీడీఓ వసంత లక్ష్మీ, ఎంపీఓ ఉషాకిరణ్, మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటేష్ గౌడ్, సర్పంచ్ లక్ష్మయ్య, ఉప సర్పంచ్ స్వరూప నరసింహ గౌడ్, ఎంపీటీసి యాదగిరి, పీఏసీఎస్ చైర్మన్లు బుర్కుంట సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed