- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మనమే సోల్జర్స్ అవుదాం.. తెలుగు యువతకు రామ్ చరణ్ కీలక పిలుపు
హైదరాబాద్ శిల్పకళా వేదికలో యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఆధ్వర్యంలో జరుగుతున్న అంతర్జాతీయ యాంటీ డ్రగ్, ఇల్లీగల్ ట్రాఫికింగ్ డే అవగాహన కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)తో కలిసి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) పాల్గొన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ శిల్పకళా వేదికలో యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఆధ్వర్యంలో జరుగుతున్న అంతర్జాతీయ యాంటీ డ్రగ్, ఇల్లీగల్ ట్రాఫికింగ్ డే అవగాహన కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)తో కలిసి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) పాల్గొన్నారు. ఈ సందర్భంగా చరణ్ మాట్లాడుతూ.. ‘ఈ ప్రోగ్రామ్ చూస్తుంటే నాకు స్కూల్ డేస్ గుర్తొచ్చాయి. చిన్నప్పుడు ఇలాంటి అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్‌లో చాలా పాల్గొనేవాడిని. ఇప్పుడు కూడా అవేర్‌నెస్ ప్రొగ్రామ్‌లో పాల్గొన్నందుకు గర్వంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు చెప్పారు. స్కూల్ పిల్లలు కూడా వాళ్లు కూడా డ్రగ్స్‌కు బానిస అవుతున్నట్లు రోజూ వార్తలు చూస్తున్నాం.. ఈ వార్తలు చాలా బాధనిస్తున్నాయి. ఇప్పుడు నేను ఒక తండ్రిగా చెబుతున్నా.. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. డ్రగ్స్‌కు దూరంగా ఉంచండి. జీవితంలో ఏదో సాధించడానికి కృషి చేయాలి. అప్పుడు ఇలాంటి డ్రగ్స్ మీదకు దృష్టి వెళ్లదు. తప్పకుండా డ్రగ్స్‌కు దూరంగా ఉందాం. దీనిపై అందరం ఒక సోల్జర్‌గా పోరాటం చేద్దాం’ అని రామ్ చరణ్ పిలుపునిచ్చారు.
Red More: లైఫ్‌లో దానిని మించిన అచీవ్‌మెంట్ మరొకటి లేదు.. విజయ్ దేవరకొండ కీలక వ్యాఖ్యలు






