- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, డైనమిక్ బ్యూరో: అమెరికాలోని సిన్సినాటి/నార్తర్న్ కెంటకీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం రాత్రి తృటిలో పెను ప్రమాదం తప్పింది. బెల్జియం నుంచి వచ్చిన ‘కలిట్టా ఎయిర్’ (Kalitta Air) విమానం ల్యాండింగ్ సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అంతర్జాతీయ మీడియా సమాచారం ప్రకారం.. కలిట్టా ఎయిర్‌కు చెందిన బోయింగ్ 777-300 ER విమానం రన్‌వే పైకి దిగుతుండగా, దాని వెనుక భాగం రన్‌వేను బలంగా రాసుకుంటూ వెళ్లింది. దీంతో రాపిడికి ఒక్కసారిగా భారీగా నిప్పురవ్వలు ఎగిసిపడ్డాయి. ప్రమాదాన్ని పసిగట్టిన పైలట్ వెంటనే అప్రమత్తమై, విమానాన్ని మళ్లీ గాల్లోకి (గో-అరౌండ్) తీసుకెళ్లాడు.
కొద్దిసేపటి తర్వాత అదే విమానాశ్రయంలో విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేయడంతో పెను ముప్పు తప్పింది. ఈ ఘటనలో విమాన సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదని కలిట్టా ఎయిర్ సంస్థ సీఓఓ తెలిపారు. ల్యాండింగ్ తర్వాత విమానాన్ని భద్రతా తనిఖీల కోసం తరలించినట్లు వెల్లడించారు. కాగా, ఈ ఘటనపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) దర్యాప్తును ప్రారంభించింది. రన్‌వేపై విమానం వెనుక భాగం నుంచి నిప్పురవ్వలు చెలరేగిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.






