- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లైఫ్‌లో దానిని మించిన అచీవ్‌మెంట్ మరొకటి లేదు.. విజయ్ దేవరకొండ కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్ శిల్పకళా వేదికలో యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఆధ్వర్యంలో జరుగుతున్న అంతర్జాతీయ యాంటీ డ్రగ్, ఇల్లీగల్ ట్రాఫికింగ్ డే అవగాహన కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan)తో కలిసి నటుడు విజయ్ దేవరకొండ పాల్గొన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ శిల్పకళా వేదికలో యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఆధ్వర్యంలో జరుగుతున్న అంతర్జాతీయ యాంటీ డ్రగ్, ఇల్లీగల్ ట్రాఫికింగ్ డే అవగాహన కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan)తో కలిసి నటుడు విజయ్ దేవరకొండ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయ్(Vijay Deverakonda) మాట్లాడుతూ.. ‘నా బాధ్యతగా ఇక్కడకు వచ్చాను. నేను, నా చుట్టూ ఉన్న వారు డ్రగ్స్ తీసుకోకుండా చూసే బాధ్యత నాది. లైఫ్‌లో తల్లిదండ్రులను సంతోషపెట్టడం కంటే గొప్ప అచీవ్‌మెంట్ ఇంకోటి లేదు. ఎప్పుడూ వారు తలదించుకునే పని చేయకూడదు. సమాజంలో డ్రగ్స్ తీసుకునేవారిని చిన్నచూపు చూస్తారు. అలాంటి పరిస్థితిని ఎదుర్కోవడం అవసరమా?. మనతో పాటు మన పేరెంట్స్‌ను కూడా సమాజం దోషుల్లా చూస్తుంది. నా అభిమానులు, తెలుగు సినిమా ఫ్యాన్స్, టోటల్ తెలంగాణ యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని కోరుతున్నా. మనం, మన స్టేట్, మన దేశం ప్రపంచంలో నెంబర్ వన్‌గా ఉండాలి. అందుకు మనవంతు కృషి తప్పకుండా చేయాలి. అన్నిటికంటే ముందు డ్రగ్స్ తీసుకోవాలని బలవంతం ఫ్రెండ్స్‌ను కట్ చేయండి. తప్పకుండా డ్రగ్స్‌కు దూరంగా ఉందాం’ అని విజయ్ దేవరకొండా పిలుపునిచ్చారు.
Red More: మనమే సోల్జర్స్ అవుదాం.. తెలుగు యువతకు రామ్ చరణ్ కీలక పిలుపు






