గాయపడిన బాలకృష్ణను ఫోన్‌లో పరామర్శించిన మంత్రి నారా లోకేశ్

by Ajay Maddhiboyina |

టాలీవుడ్ న‌టుడు నంద‌మూరి బాల‌కృష్ణ సినిమా షూటింగ్ లో ప్ర‌మాదానికి గుర‌య్యారు. కాకినాడ పోర్టు ప్రాంగ‌ణంలో NBK111 షూటింగ్ కు సంబంధించి కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్నారు. ఓ భారీ యాక్ష‌న్ స‌న్నివేశం తీస్తుండగా బాల‌కృష్ణ అనుకోకుండా కాలుజారి కింద‌ప‌డిపోయారు.

గాయపడిన బాలకృష్ణను ఫోన్‌లో పరామర్శించిన మంత్రి నారా లోకేశ్
X

దిశ‌, వెబ్ డెస్క్: టాలీవుడ్ న‌టుడు నంద‌మూరి బాల‌కృష్ణ సినిమా షూటింగ్ లో ప్ర‌మాదానికి గుర‌య్యారు. కాకినాడ పోర్టు ప్రాంగ‌ణంలో NBK111 షూటింగ్ కు సంబంధించి కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్నారు. ఓ భారీ యాక్ష‌న్ స‌న్నివేశం తీస్తుండగా బాల‌కృష్ణ అనుకోకుండా కాలుజారి కింద‌ప‌డిపోయారు. ఈ క్ర‌మంలో బాల‌కృష్ణ మోకాలికి స్వ‌ల్ప గాయ‌మైంది. ప్ర‌మాదం జ‌రిగిన వెంట‌నే యూనిట్ స‌భ్యులు షూటింగ్ ఆపేసి ఆయ‌న‌ను చికిత్స కోసం ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అయితే బాల‌య్య‌కు గాయంకావ‌డంతో మంత్రి, బాల‌య్య అల్లుడు నారాలోకేష్ ఆయ‌న‌ను ఫోన్ లో ప‌రామ‌ర్శించారు. ప్ర‌మాద వివ‌రాల‌ను అడిగి తెలుసుకున్నారు.

బాల‌కృష్ణ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని లోకేష్ ఆశాభావం వ్య‌క్తం చేశారు. ఇక ఆస్ప‌త్రిలో వైద్యులు బాల‌య్య‌కు ప్ర‌త‌మ చికిత్స అందించ‌డంతో పాటు ఇత‌ర వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. గాయం చిన్న‌దేన‌ని కంగారుప‌డాల్సిన అవ‌స‌రంలేద‌ని తెలిపారు. కొన్నిరోజులు విశ్రాంతి తీసుకోవాల‌ని సూచించారు. ఇదిలా ఉంటే బాల‌య్య గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమాలో న‌టిస్తున్నారు. వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో వ‌చ్చిన వీర‌సింహారెడ్డి బ్లాక్ బ‌స్ట‌ర్ కావ‌డంతో ఈ సినిమాపై అంచ‌నాలు నెల‌కొన్నాయి. ప్ర‌స్తుతం షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతుండగా బాల‌య్య‌కు ప్ర‌మాదం జ‌ర‌గ‌డంతో బ్రేక్ ప‌డింది.

Next Story