- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి.!
by Taduka Kalyani |
జిల్లా కేంద్రంలోని భవాని నగర్ తండాలో పసందుల చంద్రయ్య (50) అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది.

X
దిశ,మహబూబాబాద్ ప్రతినిధి: జిల్లా కేంద్రంలోని భవాని నగర్ తండాలో పసందుల చంద్రయ్య (50) అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. తండా వాసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం రాత్రి మృతుని ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో ఈ ఘటన చోటు చేసుకోవడం పలు అనుమానాలకు తావిస్తుంది. సమాచారం అందుకున్న పట్టణ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. మరణానికి గల ఖచ్చితమైన కారణం పోస్టుమార్టం నివేదిక అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉందని, అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటనను అనుమానాస్పద మృతిగా పరిగణించి విచారణ కొనసాగిస్తున్నారు.
Next Story






