- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వర్షపు నీటిని ఒడిసి పట్టి.. భావి తరాలకు నీటి భద్రత అందిద్దాం
మానవ మనుగడకు నీరే జీవాధారమని, వర్షించే ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టి భూగర్భ జలాలను పెంపొందించుకోవాలని కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ పిలుపునిచ్చారు.

దిశ, కామారెడ్డి రూరల్ : మానవ మనుగడకు నీరే జీవాధారమని, వర్షించే ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టి భూగర్భ జలాలను పెంపొందించుకోవాలని కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. కామారెడ్డి పట్టణ పరిధిలోని దేవునిపల్లి ప్రభుత్వ పాఠశాలలో మున్సిపల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో "క్యాచ్ ది రెయిన్ – వేర్ ఇట్ ఫాల్స్, వెన్ ఇట్ ఫాల్స్" కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చైర్పర్సన్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నీటి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, ఆకాశం నుంచి కురిసే ప్రతి వర్షపు బొట్టును వృథా చేయకుండా ఒడిసి పట్టి, సరైన పద్ధతుల్లో సద్వినియోగం చేసుకోవడం సామాజిక బాధ్యతగా భావించాలని అన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం చేసే రైతులకు నీటి విలువ బాగా తెలుసని, ఒక్క వర్షపు చుక్క కోసం వారు ఎంతగానో ఎదురుచూస్తారని గుర్తు చేశారు. అలాంటి అమూల్యమైన నీటిని వృథా చేయకుండా సంరక్షించాలని విద్యార్థులకు సూచించారు. ఇళ్లలోనూ నీటిని పొదుపుగా వినియోగిస్తూ, వర్షపు నీటి సంరక్షణపై అవగాహన పెంపొందించి భావి తరాలకు నీటి భద్రత కల్పించే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ కాసర్ల గోదావరి స్వామి, మున్సిపల్ కమిషనర్ పర్వతాలు, డీఈ హన్మంత్‌రావు, టీపీఓ వినీత్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు గంగా కిషన్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.






