- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యే
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్‌రావు తాను ఇచ్చిన హామీని నిలబెట్టుకుని నిరుపేద మహిళకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయించారు.

దిశ, లింగంపేట : ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్‌రావు తాను ఇచ్చిన హామీని నిలబెట్టుకుని నిరుపేద మహిళకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయించారు. ఆరు నెలల క్రితం ముస్తాపూర్ గ్రామ పర్యటన సందర్భంగా గ్రామానికి చెందిన బిట్ల రాజవ్వ అనే మహిళ తాను పూరి గుడిసెలో నివసిస్తున్నానని, తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని ఎమ్మెల్యేను కోరింది. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే మదన్ మోహన్‌రావు తప్పకుండా ఇల్లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.
ఇచ్చిన మాట ప్రకారం రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల పంపిణీలో రాజవ్వకు ఇల్లు మంజూరు కావడంతో మంగళవారం స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు ఇంటి స్థలంలో ముగ్గు వేసి నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామస్థులు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యే మదన్ మోహన్‌రావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాధ నారాయణ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు అశోక్, సిద్ధు, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు వెంకట్ గౌడ్, ఉపసర్పంచ్ రాజు, వార్డు సభ్యులు పెద్దకాంతం, బాలమణి, రజిత, రవి, సంగయ్య, గ్రామ కార్యదర్శి సుబ్బారావు, బిట్ల లింగం, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.






