కవిత చెప్పింది నిజమే అనుకుంటా..బీజేపీ బీఆర్ఎస్ పొత్తుపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

by Ajay Maddhiboyina |   (  Updated:2025-05-29 09:00:44  IST  )

కవిత వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత మాట్లాడిన మాటలు నిజమే అని అనుకుంటున్నట్టు తెలిపారు.

కవిత చెప్పింది నిజమే అనుకుంటా..బీజేపీ బీఆర్ఎస్ పొత్తుపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ వెబ్ డెస్క్: కవిత వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత మాట్లాడిన మాటలు నిజమే అని అనుకుంటున్నట్టు తెలిపారు. పెద్ద ప్యాకేజీ దొరికితే మా పార్టీ నేతలు కూడా బీఆర్ఎస్‌లో కలిసిపోతారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో అభ్యర్థులు ఎక్కడ నుండి నిలబడాలి, ఎవరు పోటీ చేయాలి అనేది వాళ్లే డిసైడ్ చేస్తారని చెప్పారు. గతంలో కూడా ఇలానే జరిగిందని అన్నారు. దాని వల్లే బీజేపీ భారీగా నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాకపోవడానికి ప్రధానకారణం తమ పార్టీ నేతలే అని చెప్పారు. సస్పెన్షన్ భయంతోనే పార్టీ క్యాడర్, నేతలు నోరు మూసుకుని కూర్చొంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

కవిత ఎవరి డైరెక్షన్‌లో వెళ్తుందో కాంగ్రెస్ నేతలే చెప్పాలి.. ఏలేటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Next Story