కవిత ఎవరి డైరెక్షన్‌లో వెళ్తుందో కాంగ్రెస్ నేతలే చెప్పాలి.. ఏలేటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Kema Shiva Kumar |   (  Updated:2025-05-29 09:02:37  IST  )

బీఆర్ఎస్‌‌ (BRS)లో కవిత తిరుగుబాటు ఆ పార్టీ శ్రేణులతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

కవిత ఎవరి డైరెక్షన్‌లో వెళ్తుందో కాంగ్రెస్ నేతలే చెప్పాలి.. ఏలేటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్‌‌ (BRS)లో కవిత తిరుగుబాటు ఆ పార్టీ శ్రేణులతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కేటీఆర్‌ (KTR)ను టార్గెట్‌గా చేసుకుని ఆమె చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. సొంత పార్టీ నేతలే తనను ఎంపీగా ఓడించారనే ఆరోపణలు బీఆర్ఎస్‌ను పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే కవిత కామెంట్స్‌పై తాజాగా బీజేపీ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి (Alleti Maheshwar Reddy) తనదైన శైలిలో స్పందించారు. కవిత పూర్తి స్టేట్‌మెంట్ విన్నాక.. ఆమె ఆవేదన మొత్తం కేటీఆర్‌ మీదే ఉందన్నారు. అదేవిధంగా ఆమె త్వరలోనే కేసీఆర్‌ (KCR)కు మరో లేఖను రాబోతోందని కామెంట్ చేశారు. కవిత పూర్తిగా ఫ్రస్టేషన్‌లో ఉండి మాట్లాడతున్నారని.. బీజేపీ (BJP)లో ఇతర పార్టీలను విలీనం చేసుకునే అవసరం లేదన్నారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ రాష్ట్రంలో ఒంటిరిగానే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పదవులు, ఆస్తులు కేటీఆర్‌కే ఇస్తున్నారనే ఆందోళన కవితలో ఉందని.. ఆమె ఎవరి డైరెక్షన్‌లో వెళ్తుందో కాంగ్రెస్ నేతలే చెప్పాలని మహేశ్వర్ రెడ్డి అన్నారు.

MP Chamala: మాటలు.. లేఖలు కాదు ఆ దెయ్యాలు ఎవరో కవిత బయటపెట్టాలి: చామల

Next Story