- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
MP Chamala: మాటలు.. లేఖలు కాదు ఆ దెయ్యాలు ఎవరో కవిత బయటపెట్టాలి: చామల
కవిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ చాలమ కిరణ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్, బీజేపీ (BJP) కలిసి రాజకీయ నాటకానికి తెరలేపాయని, కవిత వ్యాఖ్యలను చూస్తే ఇదే స్పష్టం అవుతున్నది కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (Chamala Kiran Kumar Reddy) అన్నారు. కవిత తాజాగా చేసిన వ్యాఖ్యలపై ఆయన ఓ వీడియోను రిలీజ్ చేశారు. మేము ఊహించనట్లుగానే బీజేపీతో బీఆర్ఎస్ బేరసారాలు చేసిందని, లిక్కర్ స్కామ్ నుంచి కవితను బయటపడేయడానికి బీజేపీ వద్ద తెలంగాణ ఆత్మగౌరవాన్ని బీఆర్ఎస్ తాకట్టుపెట్టిందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ బీజేపీ బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిందన్నారు. రాష్ట్రంలో బీజేపీ 8 మంది ఎంపీలు గెలవడానికి ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయకపోవడానికి ఈ రెండు పార్టీల ఒప్పందమేనని అర్థం అవుతున్నదన్నారు. కవితకు (Kavitha) చిత్తశుద్ది ఉంటే పదేళ్లు బీఆర్ఎస్ (BRS) పాలనలో ప్రజా సొమ్మును దోచుకున్న దెయ్యాలు ఎవరో కవిత బయటపెట్టాలన్నారు. తెలంగాణ సమాజంలో కవితకు భవిష్యత్ ఉండాలంటే ఈ లేఖలు, మాటలతో కాదని వాస్తవాలను ఆమె బయటపెట్టాలన్నారు. మిగులు బడ్జెట్ లో ఉన్న తెలంగాణను కవిత తండ్రి రూ.8 లక్షల కోట్లు అప్పుల పాలు చేశారని అందువల్ల అధికారంలో ఉండగా దోపిడికి పాల్పడిన వారందరికీ వ్యతిరేకంగా కవిత దర్యాప్తు సంస్థలకు స్టేట్ మెంట్ ఇవ్వాలన్నారు. కేసీఆర్ ఒక్కరే లీడర్ అని కవిత చెప్పడంలో ఆంతర్యం ఏమిటని నిలదీశారు. కాంగ్రెస్ ఎంపీగా నాకు తెలిసినంత వరకు మాకు కవిత అవసరం లేదని మా పార్టీలో నాయకత్వ లోపం ఎక్కడా లేదన్నారు.
కవిత చెప్పింది నిజమే అనుకుంటా..బీజేపీ బీఆర్ఎస్ పొత్తుపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు






