నేడు అతిభారీ వర్ష సూచన.. ఆ జిల్లాల వారికి కీలక హెచ్చరిక

by samatah |   (  Updated:2023-07-28 03:08:45  IST  )

తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్. గత కొద్ది రోజుల నుంచి రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. అయితే నేడు కూడా పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది.

నేడు అతిభారీ వర్ష సూచన.. ఆ జిల్లాల వారికి కీలక హెచ్చరిక
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్. గత కొద్ది రోజుల నుంచి రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. అయితే నేడు కూడా పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. ఆదిలాబాద్, కొమురం భీం, నిర్మల్, యాదాద్రి, సంగారెడ్డి, మెదక్, కరీంనగర్, సిద్ధిపేట, సిరిసిల్ల,జగిత్యాల, మంచిర్యాల, కామారెడ్డి, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్‌లో భారీ నుంచి అత్యంత భారీ వర్షం కురిసే అవకాశం ఉందంట. అందవులన ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు రాకూడదంటూ వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది.

Also Read: మరో 24 గంటలు.. సిటీకి కొనసాగుతున్న రెడ్ అలర్ట్..

Next Story