Rahul Gandh: రేపు హైదరాబాద్‌కు రాహుల్‌ గాంధీ.. మెస్సీ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ కోసం నగరానికి!

by Prasad Jukanti |   (  Updated:2025-12-12 12:06:38  IST  )

రాహుల్ గాంధీ రేపు హైదరాబాద్ కు వచ్చే అవకాశం ఉంది.

Rahul Gandh: రేపు హైదరాబాద్‌కు రాహుల్‌ గాంధీ.. మెస్సీ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ కోసం నగరానికి!
X

దిశ, డైనమిక్ బ్యూరో: లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు, ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) రేపు హైదరాబాద్‍కు రాబోతున్నారు. రేపు ఉప్పల్ స్టేడియంలో జరగబోయే ప్రపంచ దిగ్గజ ఫుట్ బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సి (Lionel Messi) మ్యాచ్ చూసేందుకు ఆయన హైదరాబాద్ రాబోతున్నట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. కాగా ‘మెస్సీ గోట్‌ ఇండియా టూర్‌’ పేరుతో మెస్సీ భారత్‍లో పర్యటించబోతున్నారు. ఈ టూర్‍లో భాగంగా ఆయన రేపు హైదరాబాద్‍కు రాబోతున్నాయి. సాయంత్రం 4 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకోనున్న మెస్సీ అక్కడి నుంచి బయలుదేరి ఫలక్‌నుమా ప్యాలెస్‌లో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. తర్వాత ఉప్పల్‌ స్టేడియంలో మెస్సీ కార్యక్రమం ఉంటుంది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) టీమ్‍కు మెస్సీ టీమ్‍కు మధ్య ఫ్రెండ్లీ మ్యాచ్ కూడా జరగబోతోంది. అయితే మెస్సీ కార్యక్రమానికి రావాల్సిందిగా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి నిన్న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను ఢిల్లీలో కలిసి ఆహ్వానించారు. ఈ ఆహ్వానం మేరకు రేపు రాహుల్ గాంధీ హైదరాబాద్‍కు రానున్నట్లు తెలుస్తోంది.

READ MORE ....

హైదరాబాద్‌లో మెస్సీ మ్యాచ్.. వాళ్లు మైదానం వైపు రావొద్దని రాచకొండ CP విజ్ఞప్తి

Next Story