- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్‌లో మెస్సీ మ్యాచ్.. వాళ్లు మైదానం వైపు రావొద్దని రాచకొండ CP విజ్ఞప్తి
హైదరాబాద్‌లో మెస్సీ మ్యాచ్.. వాళ్లు మైదానం వైపు రావొద్దని రాచకొండ CP విజ్ఞప్తి

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ పుట్ బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ(Lionel Messi) రేపు ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ ఆడనుండడంతో పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రత్యక్షంగా తిలకించేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు, సినీ ప్రముఖులు, అధికారులు పోటీ పడుతున్నారు. అందుకోసం ఈవెంట్ నిర్వాహకులు ఇచ్చే పాసుల కోసం పెద్ద ఎత్తున పైరవీలు చేస్తున్నారు. తాజాగా రాచకొండ పోలీస్(Rachakonda Police) కమిషనర్ సుధీర్ బాబు ఏర్పాట్లపై మీడియాతో మాట్లాడారు. మెస్సీ మ్యాచ్‌కు 2500 మంది పోలీసులకు భారీ భద్రత ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. టికెట్లు ఉన్నవారికే అనుమతి ఇస్తామని.. లేని వారు స్టేడియం వైపు రావొద్దని విజ్ఞప్తి చేశారు. స్టేడియం పరిసరాల్లో 34 చోట్ల పార్కింగ్‌కు ఏర్పాట్లు చేశారు. ఈ మ్యాచ్‌కు దేశ వ్యాప్తంగా ప్రముఖులతో పాటు విదేశీయులు కూడా వస్తుండటంతో. అందరూ క్రమశిక్షణగా ఉండాలని కోరారు. సీసీటీవీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షణ చేయబోతున్నట్లు తెలిపారు. కాగా, ఈ ఫ్రెండ్లీ మ్యాచ్‌లో మెస్సీ ప్రత్యర్థి జట్టులో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆడనున్నారు. దీంతో ఆ మ్యాచ్‌కు ప్రత్యేకత సంతరించుకున్నది.
READ MORE ....
Rahul Gandh: రేపు హైదరాబాద్‌కు రాహుల్ గాంధీ.. మెస్సీ ఫుట్‌బాల్ మ్యాచ్ కోసం నగరానికి!






