- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేసీఆర్ విద్యనే రేవంత్ ప్రయోగిస్తున్నారు: రఘునందన్ రావు
ఒకే రోజు కేసీఆర్, రేవంత్ రెడ్డి సభలు నిర్వహించడంపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు రియాక్ట్ అయ్యారు.

దిశ, డైనమిక్ బ్యూరో: నిన్నటి సభలో సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy), మాజీ సీఎం కేసీఆర్ (KCR) ఇద్దరూ తుపాకీ రాముడు మాటలే మాట్లాడారని మెదక్ ఎంపీ రఘునందన్ రావు (Raghunandan Rao) విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ బంధం వీణావాణి లాంటిందని పైకి వేర్వేరుగా కనిపిస్తున్నా ఈ రెండు పార్టీలు ఒక్కటేనన్నారు. కేసీఆర్, రేవంత్ ఒకరినొకరు కాపాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఇవాళ నాంపల్లిలోని బీజేపీ స్టేట్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. గతంలో ప్రధాని మోడీ తెలంగాణ వస్తే బీఆర్ఎస్ ఫుల్ పేజీ యాడ్స్ ఇచ్చి బీజేపీ వార్తలు రాకుండా చేశారు. ఇప్పుడు అదే విద్యను రేవంత్ రెడ్డి ప్రయోగిస్తున్నారని ఇద్దరూ ఒకేరోజు సభలు పెట్టి చెరో సగం పేజీ వార్తలు వచ్చేలాగా డ్రామాలు చేశారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ఒక నివేదిక మీద కాకుండా కాళేశ్వరం అనుమతుల నుంచి ఇప్పటి వరకు అన్నింటిపై సీబీఐకి అప్పగించి మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలన్నారు. కేసీఆర్, రేవంత్ రెడ్డిని కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిన కంపెనీ మేనేజ్ చేస్తున్నదని, ఈ కంపెనీకే మూసీ పనులు కూడా అప్పగిస్తున్నారని ఆరోపించారు.
కవితను అప్రూవర్‍గా మార్చండి:
జగిత్యాల నుంచే తమ జైత్రయాత్ర ప్రారంభం కాబోతోందన్న బీఆర్ఎస్ వ్యాఖ్యలకు రఘునందన్ కౌంటర్ ఇచ్చారు. గతంలో జగిత్యాల జైత్రయాత్ర చేసిన నక్సలైట్లు ఆపై మావోయిస్టులుగా మారి ఇప్పుడు కనుమరుగైపోయారని టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్‍గా మారిందని జలదృశ్యం నుంచి ఆ పార్టీ అదృశ్యం అవుతున్నదని ఎద్దేవా చేశారు. కేసీఆర్ హయాంలో అవినీతి జరిగిందని కేసీఆర్ బిడ్డ స్వయంగా చెప్పిందని కవితని అప్రూవర్‍గా మార్చి వాళ్ళను అరెస్ట్ చెయ్యాలని డిమాండ్ చేశారు. బూతులు బంజేసి... ప్రజల కోసం పని చేయ్యండని పిలుపునిచ్చారు.
అకాల వర్షాలతో రైతులు ఇబ్బందులు:
కేసీఆర్, రేవంత్ పాలన వల్ల తెలంగాణలో ఫసల్ బీమా లేక రైతులు అల్లల్లాడుతున్నారని మెదక్ పార్లమెంట్‍లో మూడు మండలాల్లో అకాల వర్షాలకి ఒక్క వడ్ల గింజ మిగల లేదన్నారు. చేగుంట, నార్సింగి, మాసాయిపేట మూడు మండలాలలో ఏడు గ్రామాల రైతులు ఏడుస్తున్నారని ఆరు వేల ఎకరాలు పైగా నష్టం వాటిల్లిందన్నారు. ఎద్దు ఏడ్చిన వ్యవసాయం ..రైతు ఏడ్చిన రాజ్యం బాగుండదు అంటారు. అటు కేసీఆర్ సర్కారు..ఇటు రేవంత్ సర్కారు వల్ల రైతులు తీవ్రంగా నష్ట పోతున్నారు. కేసీఆర్ సర్కారు చేసిన లక్ష కోట్ల అవినీతి ని కక్కిస్తాం అని రేవంత్ రెడ్డి గారు రాహుల్ చేత చెప్పిచ్చారని ఇప్పుడు ఎక్కడికిపోయారని నిలదీశారు.






