నేను ఆత్మహత్యకు సిద్ధం.. Putta Madhu సంచలన సవాల్

by Disha Web Desk 7 |
నేను ఆత్మహత్యకు సిద్ధం.. Putta Madhu సంచలన సవాల్
X

దిశ, మంథని: తన అభివృద్ధిని చూసి ఓర్వలేని ఓ వర్గం మీడియా తనపై అనవసరంగా అసత్య ప్రచారాలు చేస్తున్నారని, తనపై వచ్చిన ఏ ఒక్క ఆరోపణ నిరూపించినా తాను అంబేద్కర్ చౌరస్తాలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నానని పుట్ట మధు సవాల్ చేశారు. గురువారం స్థానిక చౌరస్తాలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ.. మీడియాలో తనపై కావాలని అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. తాను సంపాదించిన రూ. 900 కోట్లు ఎక్కడున్నాయో చెప్పాల్సిన అవసరం మీడియాకు ఉందన్నారు.

మంథని మధుకర్, రంగయ్య, రాజబాబు మొదలైన వాళ్ళ మృతిని కూడా రాజకీయం చేసి తనపై బురద జల్లేందుకు ఎందుకు ప్రయత్నిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. రాష్ట్రంలో ఉన్న మీడియా సామాజిక వర్గానికి అమ్ముడు పోయి తనను తొక్కేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. చీకోటి వ్యవహారంలో తనపై గత కొద్ది రోజులుగా విస్తృతంగా దుష్ప్రచారం చేసిన మీడియా తన ప్రమేయం ఎక్కడ ఉందో నిరూపించాల్సిన బాధ్యత కూడా తీసుకోవాలన్నారు. మూకుమ్మడిగా తనపై ఇలా దాడి చేసే అవసరం ఏమొచ్చిందో ప్రజలకు వివరించాలన్నారు. ఇప్పటికైనా నిజా నిజాలు ప్రజలకు తెలపాల్సిన బాధ్యత మీడియాకు ఉందన్నారు.

తమ్మినేని హత్య కేసులో నిందితులు ఎక్కడ.. ఆ వార్తలు నిజమేనా..??

కేసీఆర్‌ను ఇరకాటంలో పడేసిన సర్వాయి పాపన్న గౌడ్.. బీజేపీ వ్యూహంలో చిక్కిన సీఎం!


Next Story