యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసు.. 5 పేజీల లేఖ విడుదల చేసిన పూర్ణచందర్

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-06-29 03:15:59  IST  )

ప్రముఖ తెలుగు న్యూస్ యాంకర్, జర్నలిస్ట్ స్వేచ్ఛ బలవన్మరణం (Anchor Swetcha Suicide) మీడియా రంగంలో విషాదాన్ని మిగిల్చింది. అయితే ఆమె ఆత్మహత్యకు కారణం పూర్ణచందర్ అని స్వేచ్ఛ తండ్రి చేసిన ఆరోపణలపై.. పూర్ణ స్పందించారు.

యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసు.. 5 పేజీల లేఖ విడుదల చేసిన పూర్ణచందర్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ తెలుగు న్యూస్ యాంకర్, జర్నలిస్ట్ స్వేచ్ఛ బలవన్మరణం (Anchor Swetcha Suicide) మీడియా రంగంలో విషాదాన్ని మిగిల్చింది. అయితే ఆమె ఆత్మహత్యకు కారణం పూర్ణచందర్ అని స్వేచ్ఛ తండ్రి చేసిన ఆరోపణలపై.. పూర్ణ స్పందించారు. స్వేచ్ఛకు, తనకు మధ్య జరిగింది ఇది అంటూ 5 పేజీలతో ఒక లేఖను విడుదల చేశారు. స్వేచ్ఛకు తనకు 2009 నుంచి స్నేహం ఉందని, తామిద్దరం స్నేహితులుగా ఎన్నో విషయాలను పంచుకునేవారమన్నారు. ఆమె తల్లిదండ్రులు జనశక్తిలో పనిచేస్తూ.. 6 నెలల వయసు ఉన్న స్వేచ్ఛను వారి అన్న, వదినల వద్ద వదిలేసి ఏడాదికొకసారి చుట్టంచూపుగా వచ్చి వెళ్లేవారని తనతో చాలాసార్లు చెప్పిందని లేఖలో పేర్కొన్నారు. 2008-2009 కాలంలో మొదటిపెళ్లికి సంబంధించి విడాకులు తీసుకున్న ఆమె.. దురదృష్టవశాత్తు 2016-2017 మధ్యకాలంలో రెండో పెళ్లికి కూడా విడాకులు తీసుకుందని, స్వేచ్ఛ ఎప్పుడూ తన జీవితంలో సంతోషంగా లేదన్నారు. ఆ సంతోషాన్నంతా వార్తల్లోనే వెతుక్కుందన్నారు.

2020 తర్వాత ఆమె తనకు దగ్గరైన మాట వాస్తవమేనన్నారు. తరచూ తల్లిదండ్రుల మధ్య జరిగే గొడవలు భరించలేక రాంనగర నుంచి కవాడిగూడలో సొంతంగా ఇల్లు అద్దెకు తీసుకుందని, 2022లో పాపను కూడా తనవద్దకు తీసుకొచ్చి అన్ని బాగోగులు తానే చూసుకుంటానని చెప్పిందన్నారు. అయినా పాప బాధ్యతలన్నీ తండ్రిస్థానంలో ఉండి తానే చూసుకున్నానని, గతేడాది పాప, స్వేచ్ఛ బాధపడకూడదని రూ.5 లక్షలు ఖర్చుచేసి మెచ్యూర్ ఫంక్షన్ కూడా చేశామన్నారు పూర్ణచందర్. అంతేకాదు స్వేచ్ఛ డిప్రెషన్, యాంగ్జైటీ, ఎమోషనల్ టెండెన్సీ నుంచి బయటకు రావడానికి ఎన్నోసార్లు హాస్పిటల్ కు తీసుకువెళ్లానని, ఆ రిపోర్ట్స్ అన్నీ తన రూమ్ లో ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు. స్వేచ్ఛతో గానీ, పాపతో గానీ తనకెలాంటి విభేదాలు లేవని చెప్పారు. ఆత్మహత్యకు ముందురోజు రాత్రి స్వేచ్ఛ తండ్రి ఆమె ఇంటికి వచ్చి అన్న మాటలు తననెంతో బాధించాయని, తన గురించి చెప్పగానే ఆయన చాలా అవమానకరంగా మాట్లాడారని రాసుకొచ్చారు.

రెండేళ్లకొకసారి ఇతను మీ అల్లుడు అని చెప్తే తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుందని, డబ్బులేకపోయినా గౌరవాన్ని కోల్పోలేనన్నారని, ఇంకా ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యల గురించి స్వేచ్ఛ తనకు చెప్పుకుని ఏడ్చిందన్నారు. తను వాళ్లని ఎలా చూసుకున్నానో ఆమె బంధువులందరికీ తెలుసని, తనను స్వేచ్ఛ భర్తగా ఊహించుకుని అన్ని సోషల్ మీడియాల్లో స్వేచ్ఛ పూర్ణచందర్ అని రాసుకుందన్నారు.

Purna Chander Letter


Read More..

న్యూస్ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య.. తండ్రి సంచలన ఆరోపణలు

Next Story