తెలంగాణతో ప్రధాని మోడీకి ఎంతో అనుబంధం.. సభలో బీజేపీ స్టేట్ చీఫ్ ఆసక్తికర ప్రసంగం

by Ramesh Naini |   (  Updated:2026-05-10 13:51:25  IST  )

తెలంగాణతో ప్రధాని మోడీకి ఎంతో అనుబంధం ఉందని బీజేపీ స్టేట్ చీఫ్ రామచందర్ రావు అన్నారు.

తెలంగాణతో ప్రధాని మోడీకి ఎంతో అనుబంధం.. సభలో బీజేపీ స్టేట్ చీఫ్ ఆసక్తికర ప్రసంగం
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణతో ప్రధాని మోడీకి ఎంతో అనుబంధం ఉందని బీజేపీ స్టేట్ చీఫ్ రామచందర్ రావు అన్నారు. ఆదివారం పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన సభలో ఆయన ఆసక్తికర ప్రసంగం చేశారు. ప్రధానికి స్వాగతం పలకడానికి సభకు లక్షలాది మంది వచ్చారని, ఈ సభ రేపు తెలంగాణలో రాబోయేది భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రభుత్వానికి సంకేతమని ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని మోడీకి తెలంగాణతో ఎంతో అనుబంధం ఉందని చెప్పుకొచ్చారు. ఎందుకంటే నాడు నిజాం నుంచి హైదరాబాద్ స్టేట్‌ని దేశంలో విలీనం చేసిన రోజు సెప్టెంబర్ 17 అని, అదే రోజు ప్రధాని మోడీ పుట్టిన రోజు అని ఆయన హర్షం వ్యక్తం చేశారు. అయితే, ప్రధాని తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలకు రూ. 9,700 కోట్ల ప్రాజెక్టులను రాష్ట్రానికి, దేశానికి అంకితం చేశారని తెలిపారు.

నాడు భారత దేశంలో నక్సలైట్లు బీజేపీ, ఏబీవీపీ కార్యకర్తలను హతమార్చారని గుర్తుచేశారు. నేడు భారత దేశం మొత్తం కూడా నక్సలైట్స్ ముక్త్ భారత్‌గా అవతరించిందని, దాని ఘనత నరేంద్ర మోడీదన్నారు. మనం దేశ వ్యతిరేక శక్తులతో పోరాడుతున్నామని ఫైర్ అయ్యారు. దేశాన్ని దక్షిణాది, ఉత్తరాది అంటూ విభజించే పార్టీలతో కొట్లాడుతున్నామని వివరించారు. కుటుంబ పాలనతో రాష్ట్రాన్ని దోచుకున్న శక్తులతో మనం పోరాడుతున్నామని చెప్పుకొచ్చారు.

తెలంగాణలో పక్కా అధికారంలోకి వస్తాం.. ప్రధాని నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు

Next Story