- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Air India: నాన్నా.. ఉద్యోగం మానేసి నిన్ను చూసుకుంట.. తండ్రితో పైలట్ సుమిత్ చివరి మాటలు
ఎయిరిండియా విమాన ప్రమాదంలో ప్రణాలు కోల్పోయిన పైలట్ సుమిత్ మాటలను తలుచుకుని ఆయన తండ్రి విలపిస్తున్న తీరు అందరిని కలిచివేస్తోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: అహ్మదాబాద్ లో ఎయిరిండియా (Air India) విమాన ప్రమాదం మాటలకందని విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో మృతుల నేపథ్యం గుండెలను పిండేస్తోంది. అప్పటి వరకు తమ వారితో సంతోషాలను పంచుకున్న తమ కుటుంబ సభ్యులు, బంధువులు విమాన ప్రమాదంలో క్షణాల్లోనే కాలిబూడిదయ్యారన్న వార్త విని హతాశులయ్యారు. ఈ ఘటనలో మరణించిన వారిది ఒక్కొక్కరితి ఒక్కో గాథ వెలుగులోకి వస్తోంది. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ఫ్లైట్ కెప్టెన్ సుమిత్ సబర్వాల్ (Pilot Sumit) చివరి మాటలను తలుచుకుని ఆయన తండ్రి కన్నీరుమున్నీరు అవుతున్న తీరు అంతరిని కలిచివేస్తోంది. ప్రమాదం సంభవించిన తర్వాత ముంబయి శివారులోని పోవై ప్రాంతంలో ఉన్న పైలట్ సుమిత్ సభర్వాల్ ఇంటికి శివసేన ఎమ్మెల్యే దిలీప్ లాండే గురువారం రాత్రి వెళ్లారు. అక్కడ సుమిత్ తండ్రి (88) ని కలిసి ఓదార్చారు. లండన్ కు బయలుదేరే ముందు తనతో సుమిత్ మాట్లాడారని నేను లండన్ చేరుకున్న తర్వాత నాకు ఫోన్ చేస్తానని చెప్పారని ఆయన తండ్రి ఎమ్మెల్యేకు వివరిస్తూ విలపించారు. రెండేళ్ల క్రితం సుమిత్ తల్లి మరణించింది. సుమిత్ ఉద్యోగం రీత్యా అటు ఇటు ప్రయాణిస్తుండగా తండ్రి ఇంట్లోనే ఉంటున్నారు. ఈ ఘటనకు మూడు రోజుల ముందే వయోభారంతో బాధపడుతున్న తన తండ్రితో 'నాన్నా.. పైలట్ ఉద్యోగం మానేసి ఇక నిన్నే చూసుకుంటా' అని తన తండ్రికి మాటిచ్చారు. ఇంతలోనే ఈ ఘోరం జరిగిపోయిందని తన కుమారుడు చెప్పిన మాటలను తలచుకుంటూ ఆ తండ్రి విలపించారు.
Read More..
ప్రమాద స్థలానికి చేరుకున్న ప్రధాని మోడీ.. మృతుల కుటుంబాలకు పరామర్శ






