- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు చివరి దశలో ఉంది.. డీజీపీ సీవీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు
తెలంగాణ డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సీవీ ఆనంద్ ఫోన్ ట్యాపింగ్ కేసుపై కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: స్టేట్ డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సీవీ ఆనంద్ (CV Anand) మీడియాతో మాట్లాడారు. తనపై నమ్మకం ఉంచిన సీఎం రేవంత్ రెడ్డితో పాటు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ పోలీసింగ్‌ను దేశంలోనే నంబర్‌వన్‌గా తీర్చిదిద్దుతామని ఆయన అన్నారు. విప్లవాత్మక మార్పులతో ఇప్పటికే తాము అగ్రస్థానంలో ఉన్నామని, పోలీసింగ్ వ్యవస్థలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ని తీసుకువస్తామని వెల్లడించారు. ముఖ్యంగా ఉమెన్ సేఫ్టీ, చైల్డ్, హ్యూమన్ ట్రాఫికింగ్ మరియు డ్రగ్స్ దందాపై ప్రత్యేక ఫోకస్ పెడతామని ఆయన అన్నారు. పెరుగుతున్న నేరాల స్వరూపానికి అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత వేగంగా వినియోగించి, ప్రజలకు త్వరితగతిన సేవలు అందిస్తామని స్పష్టం చేశారు. నక్సలైట్ల నిర్మూలన కోసం ఏర్పాటైన గ్రేహౌండ్స్ మరియు ఎస్ఐబీ (SIB) విభాగాలను సరైన రీతిలో ఉపయోగించుకుంటామని తెలిపారు.
సైబర్ నేరగాళ్లు వ్యవస్థలను హ్యాక్ చేస్తూ ప్రజలను మోసగిస్తున్నారని, ఆ నేరాలను కంట్రోల్ చేసేందుకు జిల్లాల వారీగా ఎస్పీలు కూడా కార్యాచరణలో భాగస్వాములు కావాలని డీజీపీ ఆదేశించారు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ చివరి దశకు వచ్చిందని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. త్వరలోనే సిట్ (SIT) రెండో ఛార్జ్‌షీట్‌ను కూడా దాఖలు చేయబోతోందని డీజీపీ సీవీ ఆనంద్ ప్రకటించారు.






