ఫోన్ ట్యాపింగ్‌‌లు మాకు అక్కర్లేదు.. టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్

by Kema Shiva Kumar |   (  Updated:2026-05-01 09:37:14  IST  )

ఫోన్ ట్యాపింగ్‌లు తమకు అవసరం లేదని, హరీశ్ రావు ఫోన్‌ను కేసీఆరే ట్యాప్ చేసి ఉండవచ్చని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

ఫోన్ ట్యాపింగ్‌‌లు మాకు అక్కర్లేదు.. టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
X

దిశ, వెబ్‌డెస్క్: తమ పరిధిలోని సీసీ టీవీ కెమెరాలు, తాము వాడుతున్న ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు మరియు ఫోన్లను పోలీసులు ట్యాప్ చేస్తున్నారంటూ మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) చేసిన వ్యాఖ్యలకు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్‌ గౌడ్ (Mahesh Kumar Goud) ఘాటైన కౌంటర్ ఇచ్చారు. మే డే సందర్భంగా గాంధీ భవన్‌ వేదికగా నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఫోన్లు ట్యాప్ చేయడం బీఆర్ఎస్ (BRS) నాయకులకు అలవాటని, తమకు కాదని ఎద్దేవా చేశారు. అటువంటి అవసరం తమ ప్రభుత్వానికి లేదని ఆయన స్పష్టం చేశారు. గతంలో ప్రతిపక్ష నేతలు, సినీ తారల ఫోన్లను ట్యాప్ చేసింది వారు కాదా అని ఆయన నిలదీశారు. అప్పటి పరికరాలను ఉపయోగించి హరీశ్ రావు ఫోన్‌ను స్వయంగా కేసీఆరే (KCR) ట్యాప్ చేసి ఉంటారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ జిల్లాల్లో నిర్వహించబోయే సభలపై మహేశ్ కుమార్ గౌడ్ స్పందిస్తూ.. ప్రస్తుతం బీఆర్ఎస్ తన ఉనికిని కాపాడుకునే పనిలో ఉందని సెటైర్లు వేశారు. కూతురు కవిత (Kavitha) పెట్టిన వేరు కుంపటి కారణంగానే కేసీఆర్ తప్పనిసరి పరిస్థితుల్లో ఫామ్‌హౌస్ నుంచి బయటకు వస్తున్నారని ఆరోపించారు. వాటాల పంపకాల్లో తేడాలు రావడంతోనే కవిత కొత్త పార్టీ పెట్టిందని.. ఆమె అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము, ధైర్యం బీఆర్ఎస్ ముఖ్య నాయకులకు ఉందా అని మహేశ్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు.

ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు చివరి దశలో ఉంది.. డీజీపీ సీవీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు

Next Story