గాంధీభవన్‌లో పీసీసీ, పీఏసీ విస్తృస్థాయి సమావేశం ప్రారంభం

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-01-08 08:28:55  IST  )

టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అధ్యక్షతన గాంధీభవన్లో పీసీసీ, పీఏసీ విస్తృతస్థాయి సమావేశం ప్రారంభమయింది.

గాంధీభవన్‌లో పీసీసీ, పీఏసీ విస్తృస్థాయి సమావేశం ప్రారంభం
X

దిశ, వెబ్‌డెస్క్: టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అధ్యక్షతన గాంధీభవన్లో పీసీసీ, పీఏసీ విస్తృతస్థాయి సమావేశం ప్రారంభమయింది. ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ఇన్ చార్జ్ మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శులు హాజరయ్యారు. రాష్ట్రంలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో అమలు చేయాల్సిన వ్యూహాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చిస్తున్నారు. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కారణాలను పునః పరిశీలించి.. వాటిపైనే పెద్ద ఎత్తున ప్రచారం చేసేలా ప్రణాళికలు రచించాలని ప్లాన్ చేస్తోంది. మున్సిపోల్స్ లోనూ కాంగ్రెస్ విజయం సాధించేలా పార్టీ నేతలకు అధిష్ఠానం దిశానిర్దేశం చేయనుంది. క్లీన్ స్వీప్ చేసేందుకు ప్రతి వార్డు, డివిజన్ నుంచి ఆరుగురు చొప్పున అభ్యర్థుల జాబితాను రూపొందించి వారిలో సమర్థులైన వారికోసం సర్వే చేయాలని ఇప్పటికే అధిష్ఠానం నిర్ణయించింది.

Read More..

కొత్త చట్టం గ్రామీణ కూలీలకు మరణ శాసనం: ప్రధానిపై మంత్రి ఉత్తమ్ విమర్శలు

Next Story