- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొత్త చట్టం గ్రామీణ కూలీలకు మరణ శాసనం: ప్రధానిపై మంత్రి ఉత్తమ్ విమర్శలు
ప్రధాని మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త మార్పులు గ్రామీణ కూలీలకు ‘మరణ శాసనం’ లాంటివని నీటిపారుదల శాఖ మంత్రి, కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: ప్రధాని మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త మార్పులు గ్రామీణ కూలీలకు ‘మరణ శాసనం’ లాంటివని నీటిపారుదల శాఖ మంత్రి, కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. నరేగా చట్టంలో మహాత్మాగాంధీ పేరును తొలగించడం, పని హక్కులు, నిధులను కుదించడం అన్యాయమని అన్నారు. గాంధీభవన్‌లో గురువారం జరిగిన పీసీసీ, పీఏసీ విస్తృతస్థాయి సమావేశంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం సోనియా గాంధీ మానసపుత్రికగా, గ్రామీణ ప్రాంతాల్లో విప్లవాత్మక మార్పులకు దోహదపడిందని పేర్కొన్నారు.
100 రోజుల ఉపాధి హామీ దెబ్బతిన్నది
పేదలకు పని హక్కు, కనీస వేతనం కల్పించిన ఈ చట్టాన్ని మోడీ ప్రభుత్వం బలహీన పరిచిందని ఆరోపించారు. జాబ్ కార్డు ఉన్న వారికి 100 రోజుల ఉపాధి హామీ దెబ్బతిందని, గ్రామ పంచాయతీలకు ఉన్న అధికారాలను తీసేశారని విమర్శించారు. నరేగా నిధుల్లో 40 శాతం కోత పెట్టి రాష్ట్రాలపై భారం మోపారని తెలిపారు. చట్టంలోని మార్పులకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా 12 వేల గ్రామ పంచాయతీల్లో తీర్మానాలు చేసి, వాటిని రాష్ట్రపతికి అందించాలని పిలుపునిచ్చారు. నరేగా చట్టాన్ని యథావిధిగా కొనసాగించేలా ఉద్యమించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
Read More..






