- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్‍లో మార్వాడీ గోబ్యాక్ నినాదంపై పవన్ సంచలన వ్యాఖ్యలు
ఉగ్రవాదం కంటే ప్రాంతీయవాదం హానికరమని, తెలంగాణలో ఇటీవల మొదలైన ‘మార్వాడీ గో బ్యాక్’ ఉద్యమంపై కేంద్రం దృష్టి సారించాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ఉగ్రవాదం కంటే ప్రాంతీయ వాదం హానికరం అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఇవాళ హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల తెలంగాణలో మొదలైన మార్వాడీ గో బ్యాక్ ఉద్యమంపై హాట్ కామెంట్స్ చేశారు. ఇలాంటి వాటిపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు. తమిళనాడులో హిందీ గో బ్యాక్, హైదరాబాద్ లో మార్వాడీ గోబ్యాక్, నార్త్ ఇండియన్స్ గో బ్యాక్ అని మాట్లాడుతున్నారని అన్నారు. తెలంగాణ యాస, భాషలో హిందుస్తానీ ఉంటుందని అలాంటి తెలంగాణలో హిందీ ఉండొద్దని మాట్లాడితే భావాలు ఎటువైపు వెళ్తున్నాయని ప్రశ్నించారు. ఇవి దేశాన్ని విఛ్ఛిన్నం చేసే భావాలు కావా అన్నారు. అమిత్ షాను సైతం ఇలాగే మాట్లాడారని బెంగాల్ కు వస్తే తన్ని తరిమేస్తామని టీఎంసీ నాయకులు మాట్లాడారు. కానీ నాయకుల మాటలు వేరు ప్రజల మాటలు వేరు. అక్కడ ప్రజలు టీఎంసీ నాయకులను తన్ని తరిమేశారన్నారు.
‘నిరూపిస్తే ప్రాపర్టీ రాసిస్తా’.. CM రేవంత్‌కు పవన్ కల్యాణ్ సవాల్






