‘నిరూపిస్తే ప్రాపర్టీ రాసిస్తా’.. CM రేవంత్‌కు పవన్ కల్యాణ్ సవాల్

by Prasad Jukanti |   (  Updated:2026-06-02 12:31:10  IST  )

‘నిరూపిస్తే ప్రాపర్టీ రాసిస్తా’.. CM రేవంత్‌కు పవన్ కల్యాణ్ సవాల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణపై జనసేనకు రాజకీయాలకతీతమైన ప్రేమ ఉందని జనసేన అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. జనసేన తెలంగాణలో ఎందుకని కొందరు మాట్లాడుతున్నారని కానీ జనసేన తెలంగాణ నడిబొడ్డున పుట్టిందన్నారు. తెలంగాణపై ఎంత ప్రేమ ఉందో నిరూపించుకోవాల్సిన అవసరం తనకు లేదని ఆ విషయం నేను నా విమర్శకులకు చెప్పనవసరం లేదన్నారు. ఇవాళ హైదరాబాద్‍లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన పవన్ కల్యాణ్.. తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణలో లక్ష మందికి పైగా జనసేన నాయకులు, సైనికులు ఉన్నారని, తెలంగాణపై నాకున్న ప్రేమ రాజకీయాలకు అతీతం అన్నారు. ఇది కొత్తగా తెచ్చుకున్న ప్రేమకాదని, విభజనతో వచ్చిన ప్రేమ కాదన్నారు. తాను తెలంగాణకు వ్యతిరేకిని కాదని విభజించిన తీరుకు, పార్లమెంట్ తలుపులు మూసి విభజించిన తీరుకు వ్యతిరేకం అన్నారు.

తెలంగాణలో పోటీ చేస్తాం:

తాను తెలంగాణకు హైదరాబాద్‍కు వస్తానంటే అడ్డుకుంటామని కొందరు మాట్లాడుతున్నారు. అలాంటివారికి అడుగుతున్నాను తెలంగాణ మీ అయ్యజాగీరా అని ప్రశ్నించారు. తాను తెలంగాణలో మార్పు తప్ప అధికారం కోరుకోవడం లేదన్నారు. ఓ విశ్లేషకుడు చేసిన తప్పుడు విశ్లేషణతోనే ఇదంతా మొదలైంది. క్షమాపణ చెప్పి వెంటనే మళ్లీ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడతారా అని అని మండిపడ్డారు. ఆయన నేను అమిత్ షా మాట్లాడుకున్నది విన్నట్లుగా మాట్లాడితే దాన్ని ఖండించాను దానికి ప్రెస్ మీట్లో జర్నలిస్టులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడారన్నారు. తెలంగాణలో ఉపాధి లేకపోయినా, పరిశ్రమలు రాకపోయినా దానికి ఆంధ్రోడే కారణమా అన్నారు. ప్రతి దానికి ఆంద్రోళ్లే కారణమా ఈ విషయం తెలంగాణ ప్రజలు గమనించాలన్నారు. పాలకులు వేరు , ప్రజలు వేరన్నారు. తెలంగాణకు అన్యాయం చేసిన వారిలో పవన్ కల్యాణ్‍ను కూడా ఉరేయాలన్నారు. తెలంగాణలో జనసేన పోటీ చేయబోతోందని నేనే రాష్ట్రంలో తిరుగుతానన్నారు. తెలంగాణ భారత దేశంలో అంతర్భాగం అన్నారు. మీ బెదిరింపులను దశాబ్ద కాలంగా భరించామన్నారు.

చెరువు కబ్జాపై:

ప్రత్యేక రాష్ట్రం కావాలన్న ఆలోచన రాకముందే తెలంగాణ నుంచి పోరాట స్పూర్తిని పొందానన్నారు. నా సినిమాల్లో తెలంగాణ స్ఫూర్తి కనిపిస్తుందని తెలంగాణ నలుమూలలా తిరిగిన వాడినని నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో, గోండు తాండాల్లో మేం తిరిగామన్నారు. ఏపీలో నన్ను తిరగనివ్వనంటే వారాహికి తెలంగాణలో పర్మిషన్ ఇచ్చారని కోదాడ, నల్గొండ ప్రజలు నాకు అండగా నిలిచారన్నారు. తనను బెదిరించే వాళ్లు తనపై దాడి చేయాలనుకుంటే నేరుగా తన ఇంటిపైనే దాడి చేయాలనే నా ఇంటి వద్ద ప్రెస్ మీట్ పెట్టానన్నారు. బాంచన్ అనే వాళ్లం అయితే భయపడేవాళ్లం అయితే పార్టీ పెడతామా అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరినైనా ఒక్క మాట అన్నానా అని ప్రశ్నించారు. నాకు రెచ్చగొట్టడం ఇష్టం లేదన్నారు. నేను మౌనంగా ఉంటే నాలో పౌరుషం చచ్చిందని మా తెలంగాణ నేతలు చెప్పినా నేను ఏమి మాట్లాడలేదన్నారు. నన్ను ఎన్ని తిట్టినా పట్టించుకోనన్నారు. నేను కోడి చెరువును కబ్జా చేసిననట్లు ఆక్రమించుకున్నాట్లు ఆరోపణలు వస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డికి చెబుతున్నా నేను కబ్జా చేసినట్లు తేలితే ఈ క్షణమే ప్రభుత్వానికి రాసి ఇస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Next Story