- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Pawan Kalyan: హరిహర వీరమల్లు సినిమా విడుదల వేళ.. పవన్ కల్యాణ్ ఆసక్తికరమైన ట్వీట్
పవన్ కల్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు సినిమా ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. భారీ బడ్జెట్ సినిమా కావడంతో నిన్నటి నుంచి ప్రీమియర్ షోలతో పండుగ వాతావరణం నెలకొంది.

దిశ, వెబ్‌డెస్క్: పవన్ కల్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు సినిమా (Harihara Veeramallu movie) ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. భారీ బడ్జెట్ సినిమా కావడంతో నిన్నటి నుంచి ప్రీమియర్ షోలతో పండుగ వాతావరణం నెలకొంది. ఈ రోజు తెల్లవారుజామున థియేటర్ల వద్ద ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. ఇప్పటికే అన్ని థియేటర్లలో షోలు పడ్డాయి. ఈ క్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం, హీరో పవన్ కల్యాణ్ (Hero Pawan Kalyan) ఎక్స్ వేదికగా ఆసక్తికరమైన ట్వీట్ (Interesting tweet) చేశాడు. అందులో "మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు హిందువులు తమ విశ్వాసాన్ని ఆదరిస్తున్నందుకు విధించిన శిక్షాత్మక పన్ను అయిన జిజియా పన్ను, అణచివేతకు నిలువెత్తు చిహ్నంగా నిలుస్తుంది.
అయినప్పటికీ చరిత్రకారులు చాలా కాలంగా దాని క్రూరత్వాన్ని తగ్గించారు. హరిహర వీరమల్లు ధైర్యంగా ఈ అన్యాయాన్ని బయటపెడుతుంది. కోహినూర్ దొంగతనం వలె హిందువుల బాధల తుడిచివేతను, భారతదేశ సంపదను దోచుకోవడాన్ని బహిర్గతం చేస్తుంది. అచంచలమైన సంకల్పంతో, ఈ గాథ సనాతన ధర్మాన్ని, నిరంకుశత్వాన్ని ధిక్కరించిన మన కీర్తించబడని వీరుల ధైర్యాన్ని బలంగా చూపిస్తుంది" అని తన సినిమాలోని సారాంశాన్ని పవన్ కల్యాణ్ రాసుకొచ్చారు. ఇప్పటికే ఓవర్సీస్‌లో సినిమా షోలు పడగా.. పాజిటివ్ రెస్పాన్స్ (Positive response) వస్తుంది. దీంతో పవన్ కళ్యాణ్ బాక్సాఫీస్ వద్ద రికార్డులు బ్రేక్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Read More..
హరిహర వీరమల్లు రిలీజ్.. థియేటర్‌లో సందడి చేసిన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు
రేపు ‘హరిహర వీరమల్లు’ విడుదల.. CM చంద్రబాబు స్పెషల్ ట్వీట్






