- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రేపు ‘హరిహర వీరమల్లు’ విడుదల.. CM చంద్రబాబు స్పెషల్ ట్వీట్
ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటించిన ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu) మూవీ రేపు ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది.

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటించిన ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu) మూవీ రేపు ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోలు పడిపోయాయి. ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు (CM Chadrababu) ‘హరిహర వీరమల్లు’ విడుదల సందర్భంగా పవన్ కళ్యాణ్‌కు ఆయన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’ (ట్విట్టర్) వేదికగా స్పెషల్ విషెస్ చెప్పారు. పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, ప్రేక్షకులు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న ‘హరిహర వీరమల్లు’ చిత్రం విడుదల సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. మిత్రులు పవన్ కళ్యాణ్.. చారిత్రాత్మక కథాంశంతో రూపొందించిన చిత్రంలో తొలిసారి నటించిన ‘హరిహర వీరమల్లు’ సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నానని అన్నారు. ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం (Deputy CM)గా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తూనే.. సమయాన్ని సర్దుబాటు చేసుకుని నటించిన ఈ సినిమా అన్ని వర్గాలను ఆకట్టుకోవాలని ఆకాంక్షిస్తున్నా అంటూ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు.






