హరిహర వీరమల్లు రిలీజ్.. థియేటర్‌లో సందడి చేసిన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు

by Malleboina Mahesh |   (  Updated:2025-07-24 04:12:51  IST  )

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హీరోగా నటించిన భారీ బడ్జెట్ సినిమా హరిహర వీరమల్లు సినిమా ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

హరిహర వీరమల్లు రిలీజ్.. థియేటర్‌లో సందడి చేసిన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హీరోగా నటించిన భారీ బడ్జెట్ సినిమా హరిహర వీరమల్లు (Harihara Veeramallu) సినిమా ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. అయితే ప్రభుత్వ అనుమతులతో ముందస్తుగా తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సిస్ లో ఈ సినిమా ప్రీమియర్ షోలు (premiere show) నిన్న రాత్రి నుంచి మొదలయ్యాయి. పవన్ హీరోగా దాదాపు ఐదేళ్ల తర్వాత పూర్తి స్థాయి సినిమా వస్తుండటంతో ఆయన అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అలాగే ఈ సినిమా ట్రైలర్, సాంగ్స్, డైలాగ్స్ హిట్ కావడంతో.. సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఈ సినిమాను చూసేందుకు అభిమానులు వందలాదిగా థియేటర్లకు ఎగబడ్డారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని అన్ని థియేటర్ల వద్ద పవన్ అభిమానులతో పండుగ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలోనే ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో థియేటర్ల వద్ద పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. పోలవరం జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు (MLA Chirri Balaraju) కూడా ఓ అభిమానిగా థియేటర్ వద్ద సందడి చేశాడు. పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి కేక్ కట్ చేసిన బాలరాజు సంబరాలు చేసుకున్నాడు. అలాగే ఎమ్మెల్యే ఆధ్వర్యంలో జనసైనికులకు, పవన్ అభిమానులకు హరిహర వీరమల్లు సినిమాను ఉచితంగా ప్రదర్శించారు.

Read More..

రేపు ‘హరిహర వీరమల్లు’ విడుదల.. CM చంద్రబాబు స్పెషల్ ట్వీట్

Next Story