TG Municipal Elections: తెలంగాణలో పవన్ కల్యాణ్ ప్రచారం రద్దు

by Gantepaka Srikanth |   (  Updated:2026-02-06 12:47:14  IST  )

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఊపందుకున్న వేళ బీజేపీకి బిగ్ షాక్ తగిలింది.

TG Municipal Elections: తెలంగాణలో పవన్ కల్యాణ్ ప్రచారం రద్దు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల(Telangana Municipal Elections) ప్రచారం ఊపందుకున్న వేళ బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) ప్రచార కార్యక్రమాలు రద్దయ్యాయి. కొన్ని అనివార్య కారణాల వల్ల రద్దు చేసుకున్నట్లు స్వయంగా పవన్ కల్యాణ్ వెల్లడించారు. ఇదిలా ఉంటే.. జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థులకు మద్దతుగా జనసేనాని ప్రచారంలో పాల్గొంటారని జనసేన కేంద్ర కార్యాలయం ఇటీవల ఒక ప్రకటన విడుదల చేసింది. శనివారం, ఆదివారం ఆయన ప్రచారానికి సంబంధించిన షెడ్యూల్‌ను సైతం ఖరారు చేసింది. అయితే అనూహ్యంగా పవన్ కల్యాణ్ ప్రచారం రద్దు కావడం ఆసక్తిగా మారింది.

కాగా ఇప్పటికే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డిలు హైదరాబాద్‌లో పవన్ కల్యాణ్‌తో భేటీ అయ్యారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికలలో తమ పార్టీకి మద్దతు ఇవ్వాలని వారు పవన్‌ను కోరారు. ఆ సమావేశం అనంతరం, రామచందర్ రావు ట్విట్టర్ వేదికగా పవన్ కల్యాణ్ బీజేపీకి పూర్తి మద్దతును ప్రకటించారని, తమ పార్టీ అభ్యర్థుల కోసం ప్రచారం చేసేందుకు అంగీకరించారన్నారు.

తెలంగాణ పుర పోరులో జనసేన గాలి వీస్తుందా?

Next Story