నా రాస్తా అదే.. మీడియా సమావేశం తరవాత పవన్ కీలక ట్వీట్

by Ajay Maddhiboyina |   (  Updated:2026-06-03 06:14:07  IST  )

తెలంగాణలో మీడియా సమావేశం తవరాత ఎక్స వేదికగా జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కీలక ట్వీట్ చేశారు. తెలంగాణలో పవన్ రాజకీయాలపై విమర్శలు వస్తున్నవేళ జనసేనాని ఈ ట్వీట్ చేసినట్టు అర్థం అవుతోంది.

నా రాస్తా అదే.. మీడియా సమావేశం తరవాత పవన్ కీలక ట్వీట్
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో మీడియా సమావేశం తరవాత ఎక్స్ వేదికగా జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కీలక ట్వీట్ చేశారు. తెలంగాణలో పవన్ రాజకీయాలపై విమర్శలు వస్తున్నవేళ జనసేనాని ఈ ట్వీట్ చేసినట్టు అర్థం అవుతోంది. మంగళవారం ప్రెస్ మీట్ అనంతరం పవన్ వరుస ట్వీట్లు చేస్తున్నారు. తాజాగా.. అదే నా రస్తా అంటూ అచ్చమైన తెలంగాణ యాసలో ఉన్న ఓ కవితను పోస్ట్ చేశారు. ఏ రస్తా యుద్ధాలు చేస్తుందో..ప్రాణాల్ని ఆటబంతుల్లా విసిరేస్తుందో గెలుస్తుందో ఓడుతుందో.. కానీ ముందుకు పోతుందో.. అదే నా రస్తా ఏ రస్తాలో సంకెళ్లు కూడా సవాల్ చేస్తాయో.. ఏ రస్తాలో అపజయం కూడా అగ్నిజ్వాలై మండుతుందో.. ఏ రాస్తాలో మరణం మహాప్రబంధంగా ప్రతిధ్వనిస్తుందో అదే నా రాస్తా... అంటూ రాసుకొచ్చారు. ఈ కవితను ప్రముఖ కవి శేషేంద్ర రాశారు. దీనికంటే ముందు జై తెలంగాణ, జై భారత్, జై హింద్ అంటూ పవన్ పోస్ట్ చేశారు. వరుస ట్వీట్లు చేస్తుండటంతో పవన్ చెప్పినట్టుగానే తెలంగాణలో పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. తాజాగా చేసిన ట్వీట్ చూస్తుంటే ఎన్ని అడ్డంకులు వచ్చినా, విమర్శలు వచ్చినా ముందుకు వెళతాను అనే సంకేతాలు ఇస్తున్నట్టు కనిపిస్తోంది.

తెలంగాణ పాలిటిక్స్‌లో సరికొత్త మలుపు

Next Story