TG: తగ్గని పవన్ కల్యాణ్.. ప్లాన్ చేంజ్: ఎక్స్‌లో ఇంట్రెస్టింగ్ పోస్ట్

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-06-02 08:49:28  IST  )

జనసేన నవనిర్మాణ సభ రద్దయిన నేపథ్యంలో.. సాయంత్రం ప్రెస్ మీట్ నిర్వహించాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నిర్ణయించారు.

TG: తగ్గని పవన్ కల్యాణ్.. ప్లాన్ చేంజ్: ఎక్స్‌లో ఇంట్రెస్టింగ్ పోస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేడు గచ్చిబౌలిలో జనసేన నవ నిర్మాణ సభ నిర్వహించాల్సి ఉంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కానీ.. తెలంగాణ పోలీసులు ఈ సభకు అనుమతివ్వకపోవడంతో నిర్వహించలేని పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజునే సభ ఏర్పాటు చేయడంతో.. భద్రతా పరమైన సమస్యలు వస్తాయని, అందుకే పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదని సమాచారం. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ చేశారు. ఈ రోజు సాయంత్రం 4.30 గంటల నుంచి 5.30 గంటల మధ్యలో జూబ్లీహిల్స్ లోని తన నివాసంలోనే ప్రెస్ మీట్ నిర్వహించనున్నట్లు తెలిపారు. కనీసం జనసేన నేతలతో కలిసి నిర్వహించే ఈ మీడియా సమావేశానికైనా తెలంగాణ పోలీసులు అనుమతి ఇస్తారని భావిస్తున్నానంటూ ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. దీనిని బట్టి చూస్తే.. నవ నిర్మాణ సభకు అనుమతి నిరాకరించడంపై పవన్ గట్టిగానే హర్ట్ అయినట్లు కనిపిస్తోంది. ఆయన అన్నట్లే మీడియా సమావేశానికైనా పర్మిషన్ ఇస్తారో లేదో చూడాలి మరి.

సకల జనుల సంకల్పం.. అమరుల త్యాగాల రూపం.. మన తెలంగాణ : డిప్యూటీ సీఎం

పవన్ కల్యాణ్ సభపై హైవోల్టేజ్ రాజకీయం.. జనసేనకు వ్యతిరేకంగా హైకోర్టుకు పాశం యాదగిరి

Next Story