- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పవన్ కల్యాణ్ సభపై హైవోల్టేజ్ రాజకీయం.. జనసేనకు వ్యతిరేకంగా హైకోర్టుకు పాశం యాదగిరి
తెలంగాణలో పవన్ కల్యాణ్ ‘నవ నిర్మాణ సభ’కు పోలీసులు అనుమతి నిరాకరించడంతో జనసేన హైకోర్టును ఆశ్రయించగా, తెలంగాణ వాదులు కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) 'నవ నిర్మాణ సభ' పై (Janasena Nava Nirmana Sabha) హైవోల్టేజ్ రాజకీయం నడుస్తోంది. ఈ సభకు తెలంగాణ పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో జనసేన హైకోర్టును ఆశ్రయించింది. జనసేన సమావేశానికి పోలీసులు అనుమతించేలా ఆదేశాలు ఇవ్వాలని పార్టీ లీగల్ సెల్ హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ హైకోర్టు రిజిస్ట్రీ పరిశీలనలో ఉంది. అయితే జనసేన హైకోర్టుకు వెళ్లిన నేపథ్యంలో మరోవైపు సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి (Pasham Yadagiri), ప్రముఖ న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ హైకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు. తమ వాదనలు వినకుండా నిర్ణయం తీసుకోవద్దని కోరారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన చిక్కుడు ప్రభాకర్.. రాష్ట్ర అవతరణ రోజే సభ పెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నామని పవన్ సభకు అనుమతి ఇవ్వకూడదన్నారు. కేవియట్ పిటిషన్‍తో మా వాదనలు వినిపిస్తామన్నారు. పవన్ సభ నిర్వహిస్తే శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందనే రాష్ట్ర ప్రభుత్వం ఆయన సభకు అనుమతి తిరస్కరించిందన్నారు. ఈ రోజు పవన్ సభను నిర్వహించడం అంటే తెలంగాణ ఉద్యమాన్ని, రాష్ట్ర ఏర్పాటును కించపరచడమే అన్నారు. పాశం యాదగిరి మాట్లాడుతూ పవన్ సభలు ఆయన రాష్ట్రంలో పెట్టుకోవాలన్నారు.
కోర్టు నిర్ణయంపై ఉత్కంఠ:
కాగా జనసేన నవ నిర్మాణ సభకు పోలీసులు అనుమతి నిరాకరించిన నేపథ్యంలో పవన్ కల్యాణ్ ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ చేశారు. ఈ రోజు సాయంత్రం 4.30 గంటల నుంచి 5.30 గంటల మధ్యలో జూబ్లీహిల్స్ లోని తన నివాసంలోనే ప్రెస్ మీట్ నిర్వహించనున్నట్లు తెలిపారు. కనీసం జనసేన నేతలతో కలిసి నిర్వహించే ఈ మీడియా సమావేశానికైనా తెలంగాణ పోలీసులు అనుమతి ఇస్తారని భావిస్తున్నానంటూ ఆ ట్వీట్‍లో పేర్కొన్నారు. ఓ వైపు అనుమతి కోసం జనసేన లీగల్ టీమ్ గట్టిగా ప్రయత్నిస్తున్న తరుణంలో మరోవైపు తెలంగాణ వాదులు కేవియట్ పిటిషన్ దాఖలు చేయడం ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. మరి కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది?, పవన్ కల్యాణ్, తెలంగాణ వాదులు ఎలా రియాక్ట్ కాబోతున్నారు అనేది సస్పెన్స్ గా మారింది






