- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చెప్పులు మెడలో వేసి సిరిసిల్లలో ఊరేగిస్తాం.. కేటీఆర్‌కు పటేల్ రమేష్ రెడ్డి హెచ్చరిక
చెప్పులు మెడలో వేసి సిరిసిల్లలో ఊరేగిస్తాం.. కేటీఆర్‌కు పటేల్ రమేష్ రెడ్డి హెచ్చరిక

దిశ, వెబ్‌డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై కేసీఆర్, కేటీఆర్(KTR) చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి(Patel Ramesh Reddy) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. శనివారం రమేష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి భాషను చూసి తెలంగాణ సమాజం తలదించుకుంటుంది.. వీధి రౌడీలకు మించి మాట్లాడుతున్న భాషను తెలంగాణ సమాజం గమనిస్తుంది.. 8 నెలలుగా పామ్ హౌస్‌లో పడుకొని బయటకు వచ్చి ప్రజల అటెన్షన్‌ను డైవర్ట్ చేయడానికి కేసీఆర్ మాట్లాడుతున్నారని రమేష్ రెడ్డి విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేతలు మాట్లాడే భాషను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. తెలుగు రాజకీయాల్లో ఇలాంటి భాషను స్టార్ట్ చేసిందే కేసీఆర్ అని గుర్తుచేశారు. ఇకనైనా మార్పు తెచ్చుకుని కేసీఆర్ ప్రతిపక్ష పాత్ర పోషించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న రేవంత్ రెడ్డిని కేటీఆర్ చెప్పుతో కొడుతా మాట్లాడటం సరికాదని అన్నారు. మళ్లీ ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే.. మెడలో చెప్పులదండ వేసి సిరిసిల్లలోనే ఊరేగిస్తామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పార్లమెంట్, జూబ్లీహిల్స్ ఎన్నికల్లో, పంచాయితీ ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్, కేటీఆర్‌ను ప్రజలు చెప్పులతో కొట్టిన విషయాన్ని మర్చిపోయి మాట్లాడుతున్నారని అన్నారు.
Read More..
ఒక్కోసారి ఎడమకాలి చెప్పుతో కొట్టాలనిపిస్తది.. రెచ్చిపోయిన కేటీఆర్
నాయకులు తిట్టుకుంటున్నారంటే పాలనలో విఫలమైనట్టే.. బండి సంజయ్ షాకింగ్ కామెంట్స్






