నాయకులు తిట్టుకుంటున్నారంటే పాలనలో విఫలమైనట్టే.. బండి సంజయ్ షాకింగ్ కామెంట్స్

by Ajay Maddhiboyina |   (  Updated:2025-12-26 13:19:06  IST  )

తెలంగాణ రాజ‌కీయాల్లో అభివృద్ధి మాట వినిపించ‌డంలేద‌ని కేంద్ర మంత్రి బండి సంజ‌య్ పేర్కొన్నారు.

నాయకులు తిట్టుకుంటున్నారంటే పాలనలో విఫలమైనట్టే.. బండి సంజయ్ షాకింగ్ కామెంట్స్
X

దిశ‌, వెబ్ డెస్క్: తెలంగాణ రాజ‌కీయాల్లో అభివృద్ధి మాట వినిపించ‌డంలేద‌ని కేంద్ర మంత్రి బండి సంజ‌య్ పేర్కొన్నారు. ఎక్స్ వేధిక‌గా చేసిన పోస్టులో ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. అధికారంలో ఉన్న‌వారు, అధికారం కోసం ఆరాట‌ప‌డేవారు అస‌భ్య ప‌ద‌జాలంతో దూషించుకుంటున్నార‌ని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్ ప్ర‌జాచర్చ‌ను వ‌దిలేసి బూతు పురాణం అందుకున్నార‌ని విమ‌ర్శించారు. నాయ‌కులు తిట్టుకుంటున్నారంటే వాళ్లు పాల‌నలో విఫ‌లం అయిన‌ట్టేన‌ని పేర్కొన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి గురించి మాట‌లు లేవ‌ని, జ‌వాబుదారీత‌నం లేద‌ని ఆరోపించారు. భాష‌పై ఉప‌న్యాసాలు ఇచ్చే పార్టీలే ఇప్పుడు రాజ్యాంగ వేదిక‌ల నుండి అస‌భ్యక‌ర‌మైన ప‌దాల‌ను ఉప‌యోగిస్తున్నాయ‌ని మండిప‌డ్డారు. తెలంగాణ‌కు ఉద్యోగాలు, పెట్టుబ‌డులు, రైతుల‌కు ఆదాయ‌మార్గాలు, ప‌ట్ట‌ణాల్లో మెరుగైన మౌలిక స‌దుపాయాలు అవ‌సరం అని స్ప‌ష్టం చేశారు. కానీ అధికారపార్టీ మ‌రియు ప్ర‌తిప‌క్షాల మ‌ధ్య తిట్ల పురాణం అవ‌స‌రం లేద‌న్నారు. ప్ర‌జ‌లు మంచి ప్ర‌భుత్వం కోసం ఓటు వేశార‌ని, కానీ 2014 నుండి గ‌ట్ట‌ర్ పాలిటిక్స్ యే జ‌రుగుతున్నాయ‌ని ఆరోపించారు.

Read More..

వాళ్లకు క్షమాపణ చెప్పిన తరవాత కేసీఆర్ పాలమూరులో సభ పెట్టాలి.. ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Next Story