- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వాళ్లకు క్షమాపణ చెప్పిన తరవాత కేసీఆర్ పాలమూరులో సభ పెట్టాలి.. ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల వెనకబడిందని కేసీఆర్ అంటున్నారని అన్నారు.

దిశ, వెబ్ డెస్క్: జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల వెనకబడిందని కేసీఆర్ అంటున్నారని అన్నారు. కానీ ఉదండాపూర్ నిర్వాసితులను బీఆర్ఎస్ రోడ్డు మీదకు తెచ్చిందని వ్యాఖ్యనించారు. ఉదండాపూర్ భూనిర్వాసితులు మిమ్మల్ని కలవాడినికి వస్తామంటే ఎందుకు అరెస్ట్ చేయించారని ప్రశ్నించారు. కుర్చీ వేసుకుని ప్రాజెక్టు కడతామని చెప్పిన మీరు నార్లాపూర్ వెళ్లి బటన్ నొక్కి ప్రాజెక్టు పూర్తైందని చెప్పారు కదా అని ప్రశ్నించారు.
అప్పుడు ప్రాజెక్టు పూర్తైందని చెప్పి మళ్లీ 70 శాతం పూర్తై 30శాతం మిగిలి ఉందని మాట ఎలా మారుస్తున్నారని ప్రశ్నించారు. పాలమూరు రంగారెడ్డిపై మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కాళేశ్వరానికి ఒక టీఎంసీ ఎలా పెంచారని అడిగారు. దానికి 32వేల కోట్ల బడ్జెట్ పెరిగిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు పెంచకుండా ఉంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తయ్యేదని చెప్పారు. కాబట్టి మీరు పాలమూరులో సభ పెట్టే ముందు ప్రజలకు క్షమాపణలు చెప్పి రావాలని సూచించారు. కమిషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టుకు నిధులు పెంచారని ఆరోపించారు. ఇప్పటి వరకు కాలేశ్వరంలో 2టీఎసీంలు కూడా పూర్తిగా ఉపయోగపడలేదన్నారు.
Read More..






