- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
CM రేవంత్ మౌనంగా ఉన్నాడంటే అదొక్కటే రీజన్: మల్లు రవి
CM రేవంత్ మౌనంగా ఉన్నాడంటే అదొక్కటే రీజన్: మల్లు రవి

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్(BRS) నేతలు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుపై కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి(Mallu Ravi) కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయాలు హుందాగా నడపాలి.. మేము అన్నట్టే రాజకీయాలు ఉండాలి లేకపోతే ఇష్టమున్నట్టు మాట్లాడుతాము అన్నట్టుగా బీఆర్ఎఎస్ నాయకులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ నాయకుల వ్యవహారాలను ప్రజలు గమనిస్తున్నారు. ఇది రాజకీయాలలో మంచి పరిణామం కాదని అన్నారు. కేసీఆర్, కేటీఆర్‌లు పదే, పదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారు.. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఒక బాధ్యత గల ప్రజా సేవకుడిగా చాలా సహనంతో వ్యవహరిస్తున్నారని చెప్పారు. ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్‌కు సమాజంలో చాలా బాధ్యత ఉంది. అది వదిలేసి తిట్ల పురాణం ఎత్తుకున్నారు. హరీష్ రావుకు రాజకీయాలు తెలుసు.. కేటీఆర్ లాంటి అవగాహన లేని వారికి ఆయన చెప్పాలని సూచించారు.
హరీష్ రావు కూడా ఈ మధ్య నోరు జరుతున్నారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. పదేళ్లు మీరు అధికారంలో ఉన్నారు. ఇపుడు ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. ప్రజల తీర్పును గౌరవించి మనం నడుచుకోవాలి. మేము కూడా కేంద్రంలో ప్రతిపక్ష స్థానంలో ఉన్నాము.. ప్రజలు మాకు ఇచ్చిన బాధ్యతను నెరవేరుస్తున్నాము. హుందాగా రాజకీయాలు చేస్తూ ప్రజా సమస్యలపై ప్రభుత్వానికి సలహాలు, సూచనలు చేయాలి.. కానీ ప్రస్టేషన్‌తో నోటికొచ్చినట్టు మాట్లాడడం ప్రజలు సహించరు. ఇప్పటికైనా అసెంబ్లీ సమావేశాల్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొని తన అనుభవాలతో రాష్ట్రంలో ప్రజలకు మరింత మేలు ఎలా చేయవచ్చో చెప్పాలి. సమస్యలపై చర్చించాలి. అంతేకాని నోటికి పని చెప్పడం ప్రజాస్వామ్యం కాదని మల్లు రవి అన్నారు.
Read More..
భీమవరం బుల్లోడు ఎవరో తేలింది?.. కేటీఆర్‌పై ప్రభుత్వ విప్ తీవ్ర విమర్శలు






