- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భీమవరం బుల్లోడు ఎవరో తేలింది?.. కేటీఆర్‌పై ప్రభుత్వ విప్ తీవ్ర విమర్శలు
పదేళ్లలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి బూతు పురాణాన్ని పరిచయం చేసింది మీరు కాదా? కేటీఆర్ అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ నిలదీశారు.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: పదేళ్లలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి బూతు పురాణాన్ని పరిచయం చేసింది మీరు కాదా? కేటీఆర్ అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ నిలదీశారు. శుక్రవారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డిని అంత మాట అనడం సిగ్గు చేటని కేటీఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తోలు తీస్తా అని మీ నాన్న వ్యాఖ్యలు చేయడం వల్లనే మీ సీఎం రియాక్ట్ అయ్యారని అన్నారు. ఆంధ్రా వాళ్లపైన మా ముఖ్యమంత్రి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు. నువ్వు గుంటూరులో చదువుకొని అమెరికాలో ఉద్యోగం చేశావు.. తెలంగాణ గురించి నీకు ఏం తెలుసు అని మాత్రమే సీఎం అన్నారని వివరించారు. ఏపీ మాజీ సీఎం జగన్‌ను ప్రగతిభవన్ కు పిలిపించుకుని విందులు ఇచ్చింది మీరు కాదా..? అని ప్రశ్నించారు. పొతిరెడ్డిపాడుకు పొక్క పెట్టుకుని ఎపీకి నీళ్లు తరలించుకు పోయినప్పుడు మీరు మాట్లాడారా? అని నిలదీశారు.
అసహనంలో నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమౌతుందా కేటీఆర్.. అని ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. తెలంగాణ వాదంతో మీకు ఓటు వేస్తే రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకున్నారని అన్నారు. ‘భీమవరం బుల్లోడు ఎవరో వీడియోలు బయటకు వస్తున్నాయి.. మా పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి కాదు తెలుగు రాష్ట్ర సమితి.. నేను భీమవరంలో పోటీ చేస్తానని గతంలో నువ్వు మాట్లాడలేదా? ఇప్పుడు తెలంగాణ సెంటిమెంటును రగల్చించాలని చూస్తున్నావా?’ అని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ, పార్లమెంటు, కంటోన్మెంట్ , జూబ్లీహిల్స్, సర్పంచ్ ఎన్నికల్లో మీకు ఇప్పటికే ప్రజలు బుద్ధి చెప్పారు.. భవిష్యత్తులో ఏ ఎన్నిక వచ్చినా తెలంగాణ ప్రజలు తగిన శాస్త్రి చేస్తారని అన్నారు. మీరు తిట్లు ఆపకపోతే మా వైపు నుంచి కూడా రియాక్షన్ చూడాల్సి వస్తుంది.. మాటకు మాట జవాబు ఇస్తాం.. మీరు, మీ నాన్న భాష మార్చుకోవాలి.. అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హెచ్చరించారు.
Read More..
ఒక్కోసారి ఎడమకాలి చెప్పుతో కొట్టాలనిపిస్తది.. రెచ్చిపోయిన కేటీఆర్
ఆంధ్రాకు వ్యతిరేకంగా సీఎం ఎప్పుడూ మాట్లాడలేదు: కేటీఆర్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్సీ హెచ్చరిక






