- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆంధ్రాకు వ్యతిరేకంగా సీఎం ఎప్పుడూ మాట్లాడలేదు: కేటీఆర్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్సీ హెచ్చరిక
తెలంగాణ ప్రజలు చెప్పులతో కొట్టినప్పటికి సిగ్గులేకుండా కేటీఆర్ ఇంకా మాట్లాడుతున్నాడని కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మండిపడ్డారు.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: తెలంగాణ ప్రజలు చెప్పులతో కొట్టినప్పటికి సిగ్గులేకుండా కేటీఆర్ ఇంకా మాట్లాడుతున్నాడని కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మండిపడ్డారు. ఈ మేరకు ఆయన హైదరాబాద్‌లో ఇవాళ (శుక్రవారం) మీడియాతో మాట్లాడారు. నీకు, మీ అయ్యకు సిగ్గు శరం ఉంటే తెలంగాణ రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలి.. అని నిలదీశారు. మా సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న పనులు చూసి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని అన్నారు. మా ముఖ్యమంత్రి ఆంధ్రాకు వ్యతిరేకంగా ఎప్పుడూ మాట్లాడలేదన్నారు. నువ్వు గుంటూరు చదువుకొని, అమెరికా లో ఉద్యోగం చేసిన నీకు తెలంగాణ గురించి తెలియదని మాత్రమే మాట్లాడారని వివరించారు. భీమవరంలో పోటీ చేస్తానని గతంలో నువ్వే మాట్లాడావు.. మరిచిపోయావు అంటూ గుర్తుకు చేశారు.
మీ అయ్యకు దుబాయ్ శేఖర్ అనే పేరు ఎందుకు వచ్చింది? అని, గూగుల్ సెర్చ్ చేస్తే దుబాయ్ శేఖర్ కేసీఆర్ అని వస్తోందని విమర్శలు గుప్పించారు. ‘తెలంగాణ ప్రజలు నిన్ను, నీ అయ్య చెప్పులు అరిగేలా ఇప్పటికే కొట్టారు.. జూబ్లీహిల్స్ , సర్పంచ్ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన నువ్వు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా అన్ ఫిట్ అని మీ కార్యకర్తలే అంటున్నారు.. నీ చెల్లెలే నిన్ను దెయ్యం అని అంటోంది.. సొంత చెల్లె ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం లేదు నీకు’ అని తీవ్ర విమర్శలు చేశారు. నీ వ్యవహారం ఇలాగే ఉంటే భవిష్యత్తులో తెలంగాణ ప్రజలు చెప్పులు అరిగేలా కొట్టి నీ మెడలో వేసి ఊరేగిస్తారు జాగ్రత్త అని హెచ్చరించారు. బిడ్డా కేటీఆర్.. ఖబర్దార్.. మా ముఖ్యమంత్రి పైన ఇంకో సారి మాట్లాడితే సిరిసిల్లలో చెప్పుల దండ వేసి ఊరేగిస్తారు.. అని హెచ్చరించారు.
Read More..
రేవంత్ ప్రభుత్వంపై కిషన్ రెడ్డి పాజిటివ్ కామెంట్స్
ఒక్కోసారి ఎడమకాలి చెప్పుతో కొట్టాలనిపిస్తది.. రెచ్చిపోయిన కేటీఆర్






