- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రేవంత్ ప్రభుత్వంపై కిషన్ రెడ్డి పాజిటివ్ కామెంట్స్
రేవంత్ ప్రభుత్వంపై కిషన్ రెడ్డి పాజిటివ్ కామెంట్స్

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నేతృత్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) పాజిటివ్ కామెంట్స్ చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అభివృద్ధి విషయంలో కేంద్రంతో కాంగ్రెస్ ప్రభుత్వం కలిసివస్తోందని చెప్పారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఏనాడూ ఈ పరిస్థితి ఉండేది కాదని గుర్తుచేశారు. అభివృద్ధి కార్యక్రమాల కోసం ప్రధాని వచ్చినా అప్పటి సీఎం కేసీఆర్ పట్టించుకోలేదని అన్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి మారింది.. రాజకీయాలు పక్కన బెట్టి ప్రధానితో పాటు కేంద్రమంత్రులను కూడా సీఎం రేవంత్ రెడ్డి కలుస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కృషి చేస్తున్నారని తెలిపారు. ఎవరైనా ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చేయాలి.. మిగతా సమయంలో అందరికీ రాష్ట్ర అభివృద్ధే ముఖ్యమై ఉండాలని అన్నారు. విధానపరమైన అభ్యంతరాలు ఉంటే ప్రొటెస్ట్ చేయొచ్చని కిషన్ రెడ్డి సూచించారు. అంతకుముందు బీజేపీ స్టేట్ ఆఫీసులో వాజ్‌పేయి శత జయంతి ముగింపు ఉత్సవాల్లో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వాజ్‌పేయి జీవితం దేశ యువతకు ఆదర్శమన్నారు. గతంలో ఏ ప్రధాని సాహసించని విధంగా నిర్ణయాలు తీసుకున్నారని గుర్తుచేశారు. అమెరికా వంటి అగ్ర దేశాలు బెదిరింపులకు పాల్పడినా లెక్కచేయకుండా.. భారత్ సత్తాను ప్రపంచానికి చాటారన్నారు. దేశ రక్షణ, గౌరవం విషయంలో ఆయన ఎప్పుడూ రాజీపడలేదని చెప్పారు.
Read More..
ఒక్కోసారి ఎడమకాలి చెప్పుతో కొట్టాలనిపిస్తది.. రెచ్చిపోయిన కేటీఆర్






